అమరావతి...పెన్మత్స సురేష్ బాబు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అమరావతి...
పెన్మత్స సురేష్ బాబు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ...
బొత్స కామెంట్స్:
సాంబశివరావు వారసులు సురేష్ బాబు తో ఎమ్యెల్సీ గా నామినేషన్ ను సిఎంజగన్ వేయించారు.
సాంబశివరావు విజయనగరం నుంచి జగన్ వెంట మొట్టమొదట వచ్చారు.
ఆయన వారసుడుగా సురేష్ బాబు పార్టీకి విధేయుడుగా వున్నారు.
సురేష్ బాబు...
మొదట ఓదార్పు యాత్రకు జగన్ వచ్చినప్పటి నుండి ఆయన వెంట వున్నాం.
పార్టీకి విధేయుడిగా వుంటా...చెడ్డపేరు తీసుకరాను.
అమరావతి....
మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ ఆన్ అమరావతి...
ఏఎంఆర్డిఏ రివ్యూ సిఎం జగన్ చేశారు.
అమరావతి ప్రాంతం ఈ రాష్ట్రంలో అంతర్భాగం.
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని దృష్టి లో పెట్టుకొని రైతులకు రిటన్ ప్లాట్లు ఇచ్చి ఆభివృద్ధి చేస్తాం.
చంద్రబాబు లాగాచెప్పం.
చంద్రబాబు ప్రతిపక్ష బాధ్యత విస్మరించారు.
సిఆర్డిఏ చట్టం రద్దును, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించాకే శంఖు స్థాపన చేయాలనుకున్నాం.
ప్రతిపక్షాలు కోర్టు ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నాయి.
శంకుస్థాపన కు ప్రధానమంత్రి ని, దేశంలోని పెద్దలను అందరినీ పిలుస్తాం.
శుభకార్యాలు అందరికీ చెప్పి చేయడం హిందూ సాంప్రదాయం.
అమరావతి నిర్మాణం లో వున్న
భవనాలు అన్నీ పూర్తి చేస్తాం.
వాటిని ఏం చేయాలి ఎందుకు ఉపయోగించాలి అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
రైతు లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ చెబుతున్నాం.
అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం.
లేనిపోని అనుమానాలు పెట్టికోవద్దు.
ప్రతిపక్షం మాటలు నమ్మ వద్దు.