Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-10 01:08 GMT
Live Updates - Page 3
2020-08-10 12:59 GMT

మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనుల పురోగతిపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన నివాసం నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష.

సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా అదనపు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు

2020-08-10 12:53 GMT

సోలిపేట రామ‌న్న కుటుంబాన్ని ప‌ర‌మ‌ర్శించిన ఎంపీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డి

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన యంపి కోత్త ప్రభాకర్ రెడ్డి దంపతులు.

2020-08-10 12:50 GMT

ప్రభుత్వ భూములు, చెరువు కబ్జాపై హైకోర్టులో విచారణ

టీఎస్ హైకోర్టు: నాగోలు, మల్కాజిగిరి, జంగంపేట్ లో ప్రభుత్వ భూములు, నిర్మల్ చెరువు కబ్జాపై హైకోర్టులో విచారణ

వేర్వేరు ప్రజా ప్రయోజనాలపై హైకోర్టులో విచారణ

రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వెళ్లి పరిశీలించి నివేడికలివ్వాలని హైకోర్టు ఆదేశం

ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలుంటే తొలగించాలని హైకోర్టు ఆదేశం

2020-08-10 12:47 GMT

పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహణ.

మౌలాలీలో భారతీయ రైల్వే మహిళా ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ క్యాడెట్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహణ...

భారతీయ రైల్వే మహిళా రక్షక దళం సబ్ ఇన్స్ పెక్టర్ క్యాడెట్ల ( 9 - ఎ బ్యాచ్ ) పాసింగ్ - అవుట్ పరేడ్ హైద్రాబాద్ మౌలాలి లోని ఆర్పిఎఫ్ శిక్షణ కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది...

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గాను ఆర్ పిఎఫ్ శిక్షణ కేంద్రం , మౌలాలి ఐజి - డైరెక్టర్ సంజత్ సాంకృత్యాయన్ , ఐజి మరియు ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమీషనర్ జి.ఎం.ఈశ్వర్ రావులతో పాటు జోన్ కి చెందిన రైల్వే మరియు ఆర్ పిఎఫ్ ఉన్నతాధికారులు ఈ పరేడ్ ను తిలకించారు.

ఈ సందర్భంగా శ్రీ గజానన్ మాల్యా , ఉత్తమ క్యాడెట్ల పతకాలను కుమారి చెంచల్ శెఖావత్ ( టెస్ట్ క్యాడెడ్ & టెస్ట్ ఇండోర్ ) మరియు కుమారి స్మృతి బిశ్వాస్ ( టెస్ట్ అవుట్ డోర్ ) లకు బహుకరించారు...

ఈ పరేడు చెంచల్ శెఖావత్ నాయకత్వం వహించారు.

ఇదే స్ఫూర్తిని తమ దైనందిన డ్యూటీలో కొనసాగిస్తారని వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారనే విశ్వాసాన్ని జియం గజనన్ మాల్యా ప్రకటించారు..

రైల్వే ఆస్తులను , ప్రయాణికులను రక్షించే కార్యాన్ని సమర్థవంగా నెరవేర్చడంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారు..

రైల్వే ఆస్తులు రైల్వే ప్రయాణికులను మరియు వారుండే ప్రదేశాలను సంరక్షించడంలో ప్రత్యేక జాగ్రత్తను , బాధ్యతను తీసుకోవాలన్నారు..

అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన క్యాడెట్లకు పతకాలు మరియు ప్రావీణ్య యోగ్యతా పత్రాలు బహూకరించారు..

మొట్టమొదటిసారి మహిళల కోసం మౌలాలి ఆర్ పిఎఫ్ శిక్షణ కేంద్రం మొదటి బ్యాచ్ ని సమర్థవంతంగా నిర్వహించింది ..

అన్ని జోన్ల నుండి 83 మంది మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ క్యాడెట్లు శిక్షణలో ఉత్తీర్ణత సాధించారు.

ప్రస్తుతం పాసింగ్ అవుట్ అయిన వారు ఇండోర్ అవుట్డోర్ శిక్షణా కార్యక్రమాలలో 9 నెలలపాటు కఠినమైన శిక్షణ పొందారు.

2020-08-10 10:55 GMT

ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలు ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారాయి


తెరాస పార్టీ కార్యాలయం కల్వకుంట్ల కుటుంబం ఆస్తిగా మిగిలిపోతుంది


భాజపా రాష్ట్ర కార్యాలయం మాత్రమే దేశహితం కోసం పని చేస్తోంది


భాజపా కార్యకర్తలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ కేసులు పెట్టిస్తున్నాడు


ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్ పూర్తిగా విస్మరించారు


ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలన్న కేసీఆర్... నీళ్లను ఫామ్ హౌస్ కు,పదవులు కుటుంబానికి కట్టబెట్టుకున్నాడు


ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ప్రతి కార్యకర్త ఉద్యమించాలి


👆బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు


2020-08-10 10:55 GMT

తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందన్న జేపీ నడ్డా


45వేల కోట్లకు పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజక్టును దోచుకోవటం కోసమే 85వేల కోట్లకు పెంచారు


గడిచిన ఆరేళ్ళుగా తెలంగాణ ప్రజలకు చేసిందేంటో కేసీఆర్ చెప్పాలి


తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారు?


ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని 50వేల ఇళ్ళు కూడా కట్టలేదు


కరోనాను కట్టడి చేయకుండా సీఎం‌ కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రపోతున్నారు


హైకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదు


కరోనా టెస్టులు చేయటంలో తెలంగాణ వెనుకబడిపోయింది


లోక్ సభ ఎన్నికల మాదిరిగానే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి


తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల 98లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారు


కోవిడ్ ను ఎదుర్కొనే క్రమంలో కేంద్రానికి దేశ ప్రజలు సహకరించాలి


సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని కేంద్రం పనిచేస్తోంది


కార్యకర్తల కోసం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేది ప్రధాని మోదీ ఆలోచన


ప్రధాని మోదీ ఆలోచన మేరకు పార్టీ కార్యాలయాల నిర్మాణం


కోవిడ్ ను ఎదుర్కోవటంలో ప్రధాని మోదీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు


👆🏻 జేపీ నడ్డా, భాజపా జాతీయాధ్యక్షుడు


2020-08-10 10:54 GMT

టీఎస్ హైకోర్టు.....


ప్రవేశ పరీక్షలు, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై హైకోర్టులో విచారణ


ఈనెలాఖరు లేదా సెప్టెంబరులో ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందన్న ప్రభుత్వం


ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై


సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని తెలిపిన ప్రభుత్వం


సుప్రీంకోర్టు లో విచారణ ఈనెల 14న ఉందని తెలిపిన ఏఐసీటీఈ


విచారణ 17కు వాయిదా వేసిన హైకోర్టు


2020-08-10 10:54 GMT

వి.హన్మంతారావు...కాంగ్రెస్ సీనియర్ నాయకులు.

నంది ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ నిఖార్సయిన నాయకులు,

గాంధీ సిద్ధాంతాల ను తు.చ తప్పకుండా పాటించిన నాయకులు

50 ఏళ్ల కు పైగా ప్రజా జీవితంలో ఉన్న కూడా ఎవరిని నొప్పించకుండా ప్రజా సేవకు అంకితమైన నేత..

క్రమశిక్షణకు మారు పేరు, అజాత శత్రువుగా నంది ఎల్లయ్య ఉన్నారు..

పార్టీకి విధేయుడిగా నంది ఎల్లయ్య జీవిత కాలం ఉన్నారు.

ఎలాంటి వర్గాలను ప్రోత్సహించకుండా, కుటుంబాన్ని కూడా లేకుండా ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేశారు.

నంది ఎల్లయ్య సాధారణ జీవితం గడిపారు, నీతికి, నిజాయితీకి, క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనం..

ఆయన 2019 లో సిట్టింగ్ ఎంపీ అయి కూడా ఆయనకు 2019 కాంగ్రెస్ పార్టీ అనేక కారణాల వల్ల టికెట్ ఇవ్వకున్న కనీసం అసంతృప్తి కూడా వ్యక్తం చేయని క్రమశిక్షణ గల నేత

నంది ఎల్లయ్య రాజకీయ జీవితం అందరికి ఆదర్శం..

2020-08-10 10:53 GMT

ఉత్తమ్ కుమార్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షులు


నంది ఎల్లయ్య మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు.. దేశంలో చాలా గొప్ప నేతల్లో నంది ఎల్లయ్య ఒకరు...


కార్పొరేటర్ స్థాయి నుంచి 6 సార్లు లోకసభ కు, 2 సార్లు రాజ్యసభ కు ఎన్నిక కావడం ఆయన పార్టీకి ప్రజలకు చేసిన సేవకు నిదర్శనం..


ఆయన జీవితం మనకు ఆదర్శం.. ఆయన సిద్ధాంతాలను, క్రమశిక్షణను మనం ఆచరించాలి..


నాకు రాష్ట్రపతి భవన్ నుంచి మొన్నటి వరకు చాలా ఏంతో ఆప్యాయంగా మాట్లాడేవారు..


ఆయన కరోనో భారిన పడి మృతి చెందడం చాలా బాధాకరం..


ఆయనకు నిమ్స్ లో నివాళి అర్పించడానికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పార్టీ తరపున వెళ్లారు..


ఆయన ఆత్మకు శాంతి చేకూరాయాలి..


కుంతియా...


నంది ఎల్లయ్య గారి జీవితం అందరికి ఆదర్శం, దేశంలో దళిత వర్గాలకు ఆశాజ్యోతి .


ఆయన ఆశయాలు, ఆయన క్రమశిక్షణ ఆచరించాలి.


ఆయన కార్మిక వర్గాలకు ఎంతో సేవ చేశారు, గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి ఆయన కట్టుబడి పనిచేసారు..


ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి..


భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ తదితరులు సంతాప సభలో సంతాపాన్ని వ్యక్తం చేశారు.


2020-08-10 09:30 GMT

రాచకొండ కమిషనరేట్....


ఉప్పల్ పి ఎస్ పరిధిలోని రామంతాపూర్ శ్రీనివాసపురం లో నివాసం ఉంటున్న మహిళ కూతురితో సహా అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య...


సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..


Tags:    

Similar News