HRC కి ఫిర్యాదు చేసిన కౌన్సలర్...
మహబూబాబాద్ జిల్లా ఎమ్మార్వో, మున్సిపల్ ,పోలీస్ అధికారుల నుండి ప్రాణహాని ఉందని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు..
అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు..
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ క్ ఫిర్యాదు చేసిన మహబూబాబాద్ 8వ వార్డు కౌన్సలర్ బానోతు రవి.
గత జనవరిలో జరిగిన మహబూబాబాద్ మున్సిపల్ లో ఇండిపెండెంట్ గా రాష్ట్రంలో గెలుపొందిన రవి
ప్రభుత్వ భూమిలో 5సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకొని ఉన్న తన వార్డుల్లోని ప్రజల ఇల్లు కులగొట్టిన కేసులో తన పేరు పెట్టిన అధికారులు..
సంఘటన జరిగినప్పుడు నేను హైద్రాబాద్ లో ఉన్నటువంటి అన్ని ఆధారాలు చూపిన తనపై కక్షపూర్వకంగా కేసులుపెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపిన రవి..
చంపుతామని బెదిరిస్తున్నారని తన గోడును వెళ్లబోసుకున్న రవి..
తనకు జరిగిన అన్యాయానికి బాద్యులైన పలువురు ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకొవాలని కోరిన రవి..
తమపై పెట్టిన కేసులు రద్దు చేయించే విధంగా చర్యలు తీసుకోగలరని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను కోరిన రవి.
టీఎస్ హైకోర్టు.....
దర్శకుడు ఎన్.శంకర్‌కు..
భూ కేటాయింపుపై చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్..
శంకర్‌పల్లిలో రూ.5లక్షలకు..
ఎకరం చొప్పున కేటాయించడాన్ని సవాలు చేస్తూ పిటీషన్..
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు..
రూ.50కోట్లతో స్టూడియో నిర్మించనున్నట్టు కోర్టుకు తెలిపిన శంకర్..
స్టూడియో ద్వారా 300 మందికి ఉపాధికి కలుగుతుందన్న కోర్టుకు తెలిపిన శంకర్..
మార్కెట్ విలువ ప్రకారం..
రూ.2.50 కోట్లు ఉంటుందని పేర్కొన్న హెచ్‌ఎండీఏ..
రూ.2.50 కోట్ల భూమిని..
ఏ ప్రతిపదికన రూ.5లక్షలకు కేటాయించారన్న హైకోర్టు..
కేబినెట్ నిర్ణయానికి కూడా ఓ ప్రాతిపదిక ఉండాలి కదాన్న హైకోర్టు..
భూకేటాయింపులు ఓ పద్ధతిలో జరగాలని సుప్రీం పేర్కొందన్న హైకోర్ట..
ఏజీ క్వారంటైన్‌లో ఉన్న నేపథ్యంలో కొంత గడువు కావాలని కోరిన ప్రభుత్వ తరపు న్యాయవాది..
తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా.
సయీద్ హత్య కేసులో ఆరుగురి అరెస్టు
సుల్తాన్ బజార్ ఏ సి పి దేవేందర్ ఈస్ట్ జోన్ చదర్ ఘాట్ పోలిస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ సయీద్ సాజిద్ చాచు హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశాము..
స్నేహితులు 6గురు కలిసి సయీద్ అలియాస్ హత్య చేశారు .
స్నేహితులు మధ్య పాత కక్షలు గొడవల వల్ల హతమార్చారు .
శనివారం రాత్రి చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజాంపురా చమన్ వద్ద హత్య చేశారు..
ఈ ఘటన జరిగినా తరువాత పోలీస్ బృందాలు రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేశారు.
సాజిద్ ను ఆరుగురు అతికిరతకంగా కత్తులతో పొడిచి శనివారం రాత్రి పరారయ్యారు..
మృతుడు సాజిద్ సయీద్ చాచు పై అనేక కేసులు నమోదు అయ్యాయి..
ఇటీవలే మృతుడు సయీద్ చాచ ను చాదార్ ఘాట్ పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
మరునాడు సయీద్ హతం అయ్యాడు.
24 గంటల్లో ఈ కేసు చేదించాము.
మొత్తం 3 టీమ్స్ ఏర్పడి హత్య కేసు చేదించాము...
గంజాయి, వైట్ నర్, సొల్యూషన్ పిలుస్తూ మత్తు కు బానిసై ఇలా గ్యాంగ్ లు ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు.
శ్రీరాంసాగర్ లో పెరుగుతున్న వరద ఉదృతి..
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు పెరుగుతున్న వరద ఉదృతి..
ఏగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్ లోకి బారీ గా వచ్చి చేరుతున్న వదర నీరు..
ఇన్ ప్లో 36వేల క్యూసెక్ లు...
ప్రాజెక్ట్ పూర్తిస్తాయి నీటి మట్టం 1091అడుగులకు గాను ప్రస్తుతం 1075అడుగులు...
పూర్తిస్తాయి నీటి నిల్వ సామర్థ్యం 90టిఏంసిలకు గాను ప్రస్తుతం 38.5టిఏంసిలు...
మరో వారం రోజుల పాటు ప్రాజెక్ట్ లోకి వరద ప్రవాహం కోనసాగే అవకాశం ఉందంటున్నారు ప్రాజెక్ట్ అదికారులు...
ప్రభుత్వ భూములను రక్షించాలని హైకోర్టు లో పిల్
టీఎస్ హైకోర్టు: మల్కాజిగిరి లోని ప్రభుత్వ భూములను రక్షించాలని హైకోర్టు లో పిల్...
పిల్ ధాఖలు చేసిన సామాజిక కార్యకర్త సుజాత..
మల్కాజిగిరి రెవిన్యూ శాఖ పరిధిలో ప్రభుత్వ భూములను ప్రయివేటు వ్యక్తులు స్వాధీనం చేసుకుని కోట్ల రూపాయలు దండుకుంటున్నారని పిల్
ప్రయివేటు వ్యక్తులు ప్రభుత్వం భూములను పేద ప్రజకు అమ్మి మోసాలకు పాల్పడుతున్నారని కోర్టు కు తెలిపిన పిటీషనర్...
మల్కాజిగిరి శివారు ప్రాంతాల్లో ప్రభుత్వం భూములు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని కోర్టుకు తెలిపిన పిటీషనర్..
దీనిపై విచారించిన హైకోర్టు...
మల్కాజిగిరి రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీ..
తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.
జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం
ములుగు జిల్లా: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం..
నిండుకుండాను తలపిస్తున్న రామప్ప, లక్నవరం, గోదావరి నది.
ములుగు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, తాడ్వాయి, వాజేడు, పస్రా,
మండలాల్లో రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం.
చెరువులు, కుంటల్లోకి చేరుతున్న వర్షపునీరు.
చోరీ కేసును చేధించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్.. కోటి 30లక్షల నగదు స్వాధీనం..
హైదరాబాద్: గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసు చేధించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు..
- గోల్కొండ పిఎస్ పరిధిలోని బాల్ రెడ్డి నగర్ లో ఒక ఇంట్లో చోరీ పాల్పడ్డ ఐదుగురు దొంగల అరెస్టు..
- ఒక కోటి 30లక్షల నగదు స్వాధీనం..
- 5 గురి దొంగల ముఠా ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
- మరో చోరీ కేసు నగరంలో బ్రాండెడ్ సెల్ఫోన్లు దొంగతనం చేస్తున్న ముఠా అరెస్ట్ చేసిన ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు..
- 14 లక్షల రూపాయలు విలువ చేసే బ్రాండెడ్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు....
బొగ్గు ఉత్పత్తి కి అంతరాయం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
భూపాలపల్లి లొ రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.
వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి.
సుమారు 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి అంతరాయం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాటారం,మల్హర్,మహముత్తరాం, మహాదేవపూర్, పలిమేల మండల్లాలో రాత్రి నుండి కురుస్తున్న వర్షం
లక్ష్మీ బ్యారేజ్ లో జలకళ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: లక్ష్మీ బ్యారేజ్ జలకళ
35 గేట్లు ఎత్తిన అధికారులు
పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
ప్రస్తుత సామర్థ్యం 98.40 మీటర్లు
పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ లో
ప్రస్తుత సామర్థ్యం 11.409 టీఎంసీ
ఇన్ ఫ్లో 77,800 క్యూసెక్కులు
ఓట్ ఫ్లో 1,09,200 క్యూసెక్కులు