తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందన్న జేపీ నడ్డా
45వేల కోట్లకు పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజక్టును దోచుకోవటం కోసమే 85వేల కోట్లకు పెంచారు
గడిచిన ఆరేళ్ళుగా తెలంగాణ ప్రజలకు చేసిందేంటో కేసీఆర్ చెప్పాలి
తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారు?
ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని 50వేల ఇళ్ళు కూడా కట్టలేదు
కరోనాను కట్టడి చేయకుండా సీఎం కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రపోతున్నారు
హైకోర్టు మొట్టికాయలు వేసినా తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటంలేదు
కరోనా టెస్టులు చేయటంలో తెలంగాణ వెనుకబడిపోయింది
లోక్ సభ ఎన్నికల మాదిరిగానే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవటం వల్ల 98లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారు
కోవిడ్ ను ఎదుర్కొనే క్రమంలో కేంద్రానికి దేశ ప్రజలు సహకరించాలి
సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని కేంద్రం పనిచేస్తోంది
కార్యకర్తల కోసం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఉండాలనేది ప్రధాని మోదీ ఆలోచన
ప్రధాని మోదీ ఆలోచన మేరకు పార్టీ కార్యాలయాల నిర్మాణం
కోవిడ్ ను ఎదుర్కోవటంలో ప్రధాని మోదీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు
👆🏻 జేపీ నడ్డా, భాజపా జాతీయాధ్యక్షుడు