పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహణ.

మౌలాలీలో భారతీయ రైల్వే మహిళా ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ క్యాడెట్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహణ...

భారతీయ రైల్వే మహిళా రక్షక దళం సబ్ ఇన్స్ పెక్టర్ క్యాడెట్ల ( 9 - ఎ బ్యాచ్ ) పాసింగ్ - అవుట్ పరేడ్ హైద్రాబాద్ మౌలాలి లోని ఆర్పిఎఫ్ శిక్షణ కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది...

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గాను ఆర్ పిఎఫ్ శిక్షణ కేంద్రం , మౌలాలి ఐజి - డైరెక్టర్ సంజత్ సాంకృత్యాయన్ , ఐజి మరియు ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమీషనర్ జి.ఎం.ఈశ్వర్ రావులతో పాటు జోన్ కి చెందిన రైల్వే మరియు ఆర్ పిఎఫ్ ఉన్నతాధికారులు ఈ పరేడ్ ను తిలకించారు.

ఈ సందర్భంగా శ్రీ గజానన్ మాల్యా , ఉత్తమ క్యాడెట్ల పతకాలను కుమారి చెంచల్ శెఖావత్ ( టెస్ట్ క్యాడెడ్ & టెస్ట్ ఇండోర్ ) మరియు కుమారి స్మృతి బిశ్వాస్ ( టెస్ట్ అవుట్ డోర్ ) లకు బహుకరించారు...

ఈ పరేడు చెంచల్ శెఖావత్ నాయకత్వం వహించారు.

ఇదే స్ఫూర్తిని తమ దైనందిన డ్యూటీలో కొనసాగిస్తారని వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారనే విశ్వాసాన్ని జియం గజనన్ మాల్యా ప్రకటించారు..

రైల్వే ఆస్తులను , ప్రయాణికులను రక్షించే కార్యాన్ని సమర్థవంగా నెరవేర్చడంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారు..

రైల్వే ఆస్తులు రైల్వే ప్రయాణికులను మరియు వారుండే ప్రదేశాలను సంరక్షించడంలో ప్రత్యేక జాగ్రత్తను , బాధ్యతను తీసుకోవాలన్నారు..

అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన క్యాడెట్లకు పతకాలు మరియు ప్రావీణ్య యోగ్యతా పత్రాలు బహూకరించారు..

మొట్టమొదటిసారి మహిళల కోసం మౌలాలి ఆర్ పిఎఫ్ శిక్షణ కేంద్రం మొదటి బ్యాచ్ ని సమర్థవంతంగా నిర్వహించింది ..

అన్ని జోన్ల నుండి 83 మంది మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ క్యాడెట్లు శిక్షణలో ఉత్తీర్ణత సాధించారు.

ప్రస్తుతం పాసింగ్ అవుట్ అయిన వారు ఇండోర్ అవుట్డోర్ శిక్షణా కార్యక్రమాలలో 9 నెలలపాటు కఠినమైన శిక్షణ పొందారు.

Update: 2020-08-10 12:47 GMT

Linked news