Live Updates: ఈరోజు (సెప్టెంబర్-07) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-07 02:14 GMT
Live Updates - Page 3
2020-09-07 09:04 GMT

Warangal Urban updates: అన్ని మండలాల్లో పని చేస్తున్న విఆర్వో లు రికార్డులను తహశీల్దార్లకు అందజేశారు..

వరంగల్ అర్బన్

-రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అర్బన్ జిల్లాలోని అన్ని మండలాల్లో పని చేస్తున్న విఆర్వో లు రికార్డులను తహశీల్దార్లకు అందజేశారు.

-మధ్యాహ్నం 3 గంటల లోపు అన్ని మండలాల్లోని రికార్డులు కలెక్టర్ కు అందజేయనున్న తహశీల్దార్లు..

2020-09-07 08:16 GMT

Telangana updates: ప్రణబ్ ముఖర్జీ సంతాప తీర్మానం ప్రవేశ పెట్టిన సీఎంకెసిఆర్ ..

-అధికార పార్టీ నుండి సంతాప తీర్మానంపై మాట్లాడిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఈటెల, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి

-కాంగ్రెస్ నుండి సీఎల్పీ నేత భట్టి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

-Mim నుండి పాషాఖాద్రి

-సంతాప తీర్మానం పై మాట్లాడిన ఎమ్మెల్యే లు బాల్క సుమన్, సుధీర్ రెడ్డి

-స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. 

ప్రణబ్ ... పీవీ మంత్రి వర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు.

-ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత ప్రణబ్ ది

-అందరి మన్ననలు పొందిన వ్యక్తి

-తెలంగాణ బిల్లుపై సంతకం చేసి..ప్రజల మనసులో నిలిచిపోయారు

-సభలో రెండు నిమిషాలు మౌనం పాటించిన ఎమ్మెల్యే లు

2020-09-07 07:57 GMT

Telangana updates: ముఖ్యమంత్రి కేసీఆర్ పాత, కొత్త తరాలకు,భవిష్యత్ తరాలకు క్షమాపణ చెప్పాలి..

బీజేపీ మీడియా స్టేట్మెంట్

కె కృష్ణసాగర రావు..బీజేపీ

ముఖ్య అధికార ప్రతినిధి,

-కేసీఆర్ వాస్తవ తెలంగాణ చరిత్రని తక్కువ చేసి చూస్తున్నారు. ఆయన తన స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చరిత్రను వక్రీకరించి కొత్త భాష్యం   చెప్తున్నారు.

-తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17 ని అధికారికంగా చారిత్రాత్మక దినోత్సవంగా ప్రకటించి ఎందుకు నిర్వహించడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని   బీజేపీ డిమాండ్ చేస్తుంది.

-కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేకన్నా ముందు ఈ పండగను నిర్వహించాలని డిమాండ్ చేసి సడెన్ గా ఎందుకు యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చిందో సమాధానం   చెప్పాలి.

-తెలంగాణ ప్రజల మీద పేదలు, అణగారిన వర్గాల మీద నిజాం అతడి రజాకారుల సైన్యం చేసిన దుర్మార్గాల్ని ఆయన గుర్తిస్తున్నారా లేదా..? అలాగే నిజాంలు   విదేశీ ఆక్రమణదారులే తప్ప స్వదేశీయులు కాదన్న విషయం సీఎం కేసీఆర్ కు తెలుసా..?తెలియదా..?.

-ఈ వందల ఏళ్ల విదేశీ పాలన సెప్టెంబర్ 17 ,1948 రోజున అంతమయ్యిందన్న విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకుంటారా..? లేదా..?.

-ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ ప్రతీసారి అనేక వేదికల మీద తాను ముఖ్యమంత్రి అయితే గనుక సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవం గా   జరుపుతానని ప్రకటించారు.

-మరి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పిన ఈ వ్యక్తిని ఏమని పిలవాలి..?.

-తెలంగాణ స్వాతంత్ర్యం కోసం నిజాం రాజుకి వ్యతిరేకంగా పోరాడిన ఎందరో స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలకు విలువ లేకుండా చేసి కేవలం   ముస్లింలను ఓట్ల కోసం కేసీఆర్ ఇదంతా చేస్తున్నారు.

-తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17 ని తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు   చేస్తాము. సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ కు ఎంతో ప్రత్యేకమైన రోజు. ప్రతీసారి సెప్టెంబర్ 17 ని ఆగస్టు 15 స్థాయిలో తెలంగాణలో నిర్వహిస్తాం.

-నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు చిహ్నంగా స్మారక స్తూపం ఒకటి భారీ ఎత్తున హైదరాబాద్ నడిబొడ్డున నిర్మిస్తాం.   తెలంగాణ కు నిజమైన స్వాతంత్య్రం సెప్టెంబర్ 17 నే. కావాలంటే ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ బహిరంగంగా తిరస్కరించమని బీజేపీ ఛాలెంజ్ చేస్తుంది.

2020-09-07 06:52 GMT

Telangana updates: ప్రణబ్ ముఖర్జీ గారు అతి చిన్న వయసులో ప్రజాజీవితంలోనికి వచ్చారు:-జీవన్ రెడ్డి..

జీవన్ రెడ్డి..ఎమ్మెల్సీ.

-శాసన సభ్యునిగా ప్రారంభమయ్యి ఆయన చేయని పదవి లేదు.

-అతి చిన్న వయస్సులో ఆర్దిక మంత్రిగా పని చేసారు.

-ఇంధిరా గాంధీ తర్వాత రెండో స్థానంలో పనిచేసారు.

-తెలంగాణ రావడంలో ప్రణబ్ సహాయం ఉంది.

-నాడు ప్రణబ్ కమిటి కూడా సోనియా వేసారు.

-తెలంగాణ బిల్లుపై ప్రణబ్ సంతకము తో మన కళ నెలవేరింది.

-కాంగ్రెస్ ఆయన ఏసమస్య వచ్చిన ట్రబుల్ షూటర్ గా బాగా పనిచేసారు.

-ప్రణబ్ మనకు ఆదర్శనీయుడు.

2020-09-07 06:49 GMT

Telangana updates: ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు:-సబితా ఇంద్రారెడ్డి..

మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

-జర్నలిస్ట్ గా,అధ్యపకుడిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు..

-ఆయన ఎన్నో ఎత్తుపల్లలు చూసారు..

-ఎంత క్లిష్టమైన పని అయినా చాలా సులువుగా చేసేవారు...

-పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి...

-95 మంత్రి వర్గ ఉప సంఘాలకు నాయకత్వం వహించారు..

-తెలంగాణ ఏర్పాటు గెజిట్ పై రాష్ట్రపతి హోదాలో సంతకం చేసారు. ఆయనను తెలంగాణ ప్రజలు ఎప్పుడు మరచిపోరు...

2020-09-07 06:43 GMT

Telangana updates: శాసన మండలి లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప తీర్మాణం లో:-మంత్రి తలసాని..

మంత్రి తలసాని..

ప్రణబ్ ముఖర్జీ అజాత శత్రువు..

-మారుమూల గ్రామం లో పుట్టి అంచలు అంచలుగా ఎదిగారు..

-ఏపదవి ఇచ్చిన దానికి వన్నె తెచ్చారు..

-తన పుస్తకం లో మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గురించి రాసారు..

-ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్న...

-బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు...

-భారత రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు ప్రణబ్ ముఖర్జీ..

-ఆయన కాంగ్రెస్ నాయకుడు అయినా ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకు భారత రత్న ఇచ్చింది అంటే ఆయన గొప్పతనం ఎంటో తెలుస్తుంది...

-తెలంగాణ పై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ..

2020-09-07 06:38 GMT

Telangana updates: శాసన మండలి కి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మస్కులు పెట్టుకొని హాజరయిన సభ్యులు...

శాసన మండలి..

-సభలో భౌతిక దూరం పాటిస్తూ సిట్టింగ్ ఏర్పాట్లు..

-కరోన జాగ్రత్తల పై సభలో ప్రస్తావించిన మండలి చెర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి...

-సభలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి సంతాప తీర్మాణం ప్రవేశపెట్టిన హోమ్ మంత్రి మహమూద్ అలీ...

2020-09-07 06:34 GMT

Telangana updates:దేశం గర్వించదగ్గ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ:-భట్టి విక్రమార్క..

భట్టి విక్రమార్క -సీఎల్పీ నేత..

-ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపి... ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు

-చిన్న వయసులోనే ఆర్థిక మంత్రిగా చేసిన ఘనత ప్రణబ్ ది

-95 మంత్రి వర్గ ఉప సంఘాలకు ప్రణబ్ టీం లీడర్ గా పని చేశారు

-కరోనా భారిన పడి మాజీ రాష్ట్రపతి మరణించడం బాధాకరం

-రాష్ట్ర విభజన సమయంలో ప్రణబ్ ని కలిశాం

-విభజన బిల్లు అసెంబ్లీ కి వచ్చిన బిల్లు అమలు నిర్ణయం ఎలా అమలు చేయాలన్న విషయాలు ఆయనతో చర్చించాం

-సీఎం ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానం కి మా మద్దతు..

2020-09-07 06:08 GMT

Telangana updates:-అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మండలి , శాసనసభ లో మా వాణిని వినిపిస్తాం: -రామచంద్రరావు..

రామచంద్రరావు బీజేపీ ఎమ్మెల్సీ...

-బీజేపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తారనే ఆశిస్తున్నాం..

-కొత్త రెవెన్యూ పై అసెంబ్లీ లో చట్టం చేస్తున్నట్లు తెలుస్తోంది ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి...

-విఆర్వో ల వ్యవస్థ రద్దు చేస్తామనడం దారుణం...

-దీనిపై అసెంబ్లీ లో మాట్లాడుతాం...

2020-09-07 06:04 GMT

CM K.C.R.: దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ పేరు లేని పేజీ ఉండదు..

కేసీఆర్ ..ముఖ్యమంత్రి

-బెంగాల్ లోని చిన్న గ్రామంలో పుట్టారు

-భారత మాత ప్రియపుత్రుడుగా ఎదిగాడు

-జఠిల సమస్యలు పరిషరించడంలో ఆయన నేర్పరి.

-మిత్ర పక్షాలు కూడా విశ్వాసంలోకి తీసుకున్న నాయకుడు ప్రణబ్

-పార్లమెంట్ లో తప్పు దొర్లితే వెంటనే క్షమాపణ కోరే వారు

-తెలంగాణ సాధనలో ప్రణబ్ పాత్ర ఉంది

-ప్రజల ఆలోచన అర్థం చేసుకుని అధిష్టానం కి నచ్చచెప్పారు

-తెలంగాణ బిల్లుపై ఆయనదే సంతకం

-సంతాపం తెలియజేస్తూ సభ తీర్మానం చేస్తోంది.

Tags:    

Similar News