Live Updates: ఈరోజు (సెప్టెంబర్-07) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-07 02:14 GMT
Live Updates - Page 4
2020-09-07 05:36 GMT

TS High court updates:తెలంగాణ లో ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు లో పిటీషన్..

టీఎస్ హైకోర్టు....

-పిటీషన్ దాఖలు చేసిన నర్సింగ్ రావు...

-యుజి, పీజీ కోర్సుల్లో సైతం చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించిందని కోరిన పిటిషనర్.

-నేడు విచారణకు రానున్న పిటీషన్.

2020-09-07 05:34 GMT

TS High court updates: తెలంగాణ హైకోర్ట్ లో నేడు విచారణకు రానున్న పిటీషన్ లు.

టీఎస్ హైకోర్టు....

-గాంధీ, ఉస్మానియా ఆస్పత్రి లలో కోవిడ్ పరీక్షలు చేయట్లేదని పిటీషన్ దాఖలు

-కరోనా లక్షణాలు ఉన్న వారికి సైతం గాంధీ ఉస్మానియా లో పరీక్షలు చేయట్లేదని పేర్కొన్న పిటీషనర్

-ప్రతి ప్రభుత్వ , ప్రైవేట్ హాస్పిటల్ లలో హై కోర్ట్ ఆదేశాలు ఇచ్చినా ఇంకా బెడ్స్ వివరాలు దిస్ ప్లే పేటడం లేదని పేర్కొన్న పిటీషనర్

-నేడు విచారణ చేపట్టనున్న హైకోర్ట్.

-కరోనా బారిన పడిన పేషంట్ల కోసం 104 హెల్ప్ లైన్ నంబర్ సేవలను మెరుగ్గా ఉపోయోగించెల ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటిషనర్.

2020-09-07 05:13 GMT

Telangana updates: వీఆర్వో వ్యవస్థ రద్దుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం..

తెలంగాణ..

-రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌లకు సీఎస్‌ ఆదేశం.

-మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులు స్వాధీనం చేసుకుని..

-సా.5 గంటల కల్లా రిపోర్ట్‌ పంపాలని కలెక్టర్లకు ఆదేశం.

-వీఆర్వో ల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు.

2020-09-07 05:13 GMT

Telangana updates: వీఆర్వో వ్యవస్థ రద్దుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం..

తెలంగాణ..

-రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌లకు సీఎస్‌ ఆదేశం.

-మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులు స్వాధీనం చేసుకుని..

-సా.5 గంటల కల్లా రిపోర్ట్‌ పంపాలని కలెక్టర్లకు ఆదేశం.

-వీఆర్వో ల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు.

2020-09-07 05:03 GMT

Telangana updates: మంత్రి హరీష్ రావు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కోరుతూ సిద్దిపేట నుండి వేములవాడ రాజన్న సన్నిధికి పాదయాత్ర.

రాజన్నసిరిసిల్ల జిల్లా..

-రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కోరుతూ సిద్దిపేట నుండి వేములవాడ రాజన్న సన్నిధికి పాదయాత్ర.

-వేములవాడ కి చేరుకొని రాజన్న ను దర్శించుకున్న కార్యకర్తలు

-టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు ఆకు బత్తిని రాము, కౌన్సిలర్ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వేములవాడ కు చేరుకున్న పాదయాత్ర

2020-09-07 04:50 GMT

Telangana updates: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రారంబమైన కాంగ్రెస్ పక్ష సమావేశం..

-అసెంబ్లీ సీఎల్పీ ఆఫీస్ లో కాంగ్రెస్ శాశనసభ పక్ష సమావేశం ప్రారంభం.

-హాజరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు , రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,

-అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ.

2020-09-07 04:45 GMT

Jayashankar Bhupalpally updates: సరస్వతి బ్యారేజ-2 గేట్లు ఎత్తిన అధికారులు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు

-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

-ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ

-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4,600 క్యూసెక్కులు.

2020-09-07 03:28 GMT

LB Nagar Accident: హైదరాబాద్ లో అర్ధరాత్రి కారు బీభత్సం ఇద్దరు మృతి

ఎల్బీనగర్ నగర్ - దిల్ షుక్ నగర్ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం...

- అతి వేగంతో దూసుకు వచ్చిన కారు...

- చైతన్యపురి యూ టర్న్ వద్ద రోడ్డు దాటుతున్న రవి ధన్ రాజ్ ఇద్దరిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి...

- పరారైన కారు డ్రైవర్....

- కారు నెంబర్ ద్వారా దర్యాప్తు చేస్తున్న సరూర్ నగర్ పోలీసులు.

- పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించిన పోలీసులు...

2020-09-07 03:26 GMT

Bhadradri Kotthagudem updates: భద్రాచలం ఏజెన్సీలో మావోయిస్టుల విధ్వంసం

భద్రాద్రి కొత్తగూడెం 

- చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్ట్ సమీపంలో మందు పాతర పేల్చిన మావోయిస్టులు

- పెద్దమిడిసిలేరు - తిప్పాపురం రహదారి పై పేలుడులో భారీ గుంతలు

-మావోయిస్టు శంకర్ ఎన్ కౌంటర్ కి నిరసనగా మందు పాతర పేల్చినట్లు లేఖ వదిలి వెళ్ళిన మావోయిస్టులు

- 10 కిలోమీటర్ల దూరం వరకు భారీ శబ్దం రావడంతో ఆందోళనలో సమీప ప్రాంతాల ప్రజలు

Tags:    

Similar News