Live Updates: ఈరోజు (సెప్టెంబర్-07) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 07 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | పంచమి ( సా. 6-11వరకు) తదుపరి షష్ఠి | భరణి నక్షత్రం పూర్తిగా | అమృత ఘడియలు (రా. 12-58 నుంచి 2-44 వరకు) | వర్జ్యం (మ.2-21 నుంచి 4-07 వరకు) | దుర్ముహూర్తం (మ.12-22 నుంచి 1-11 వరకు తిరిగి మ.2-50 నుంచి 3-39 వరకు) | రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) | సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-07
ఈరోజు తాజా వార్తలు
జాతీయ పార్టీ పై వస్తున్న వార్తల స్పందించిన సీఎం కేసీఆర్
పార్టీ పెట్టె ఆలోచన ఏమీలేదు
పార్టీ పెట్టె ఆలోచన ఏమైనా ఉంటే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము
రెవెన్యూ చట్టం పై సుదీర్ఘంగా ఎల్పీ సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్
దేశంలో ఎక్కడా లేని విదంగా రెవెన్యూ చట్టం
ఎల్లుండి సభలో రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
కొత్త చట్టం వస్తే భూ కబ్జా విషయంలో గుండాలు- దాదాగిరి నడువదు
ఎల్లుండే సభలో రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టనున్న కెసిఆర్ ప్రభుత్వం
కూలంకశంగా చట్టంపై చర్చిద్దాము.
కొత్తచట్టం వస్తే.. భూములపై గుండాయిజం దాదాగిరి కబ్జాలుండవు.
ఓఎల్ఎక్స్, క్రెడిట్ కార్డ్, ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా పేర్లతో 57 లక్షలు ఆన్ లైన్ ద్వారా మోసం...
మూసాపేట్ కు చెందిన సూరి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా కోసం ఆన్ లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజ్ పేర్లతో తో 53 లక్షలు వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు....
తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు...
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ పోలీసులు....
ఓఎల్ఎక్స్, క్రెడిట్ కార్డ్, ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా పేర్లతో 57 లక్షలు ఆన్ లైన్ ద్వారా మోసం...
మూసాపేట్ కు చెందిన సూరి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా కోసం ఆన్ లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజ్ పేర్లతో తో 53 లక్షలు వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు....
తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు...
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ పోలీసులు....
మరికొద్ది సేపట్లో ప్రగతి భవన్ లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ మంత్రి వర్గ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం పై చర్చ.
కొత్త నిబంధనలు ఏవిదంగా ఉండబోతున్నాయి. అవినీతిని అరి కట్టడానికి కొత్త చట్టం ఎంత కఠినంగా ఉండబోతోందో మంత్రి వర్గ సహచరులకు వివరించనున్న సీఎం కేసీఆర్.
కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
సభలో ప్రవేశపెట్టే 4 బిల్లుల పై మంత్రి సమావేశం లో చర్చ.
మంత్రులకు దిశ నిర్ధేశ్యం చేయనున్న సీఎం కేసీఆర్.
సభలో అనుసరించే వ్యూహం, ఏ అంశం పై ఎవరెవరు మాట్లాడాలి సూచించనున్న సీఎం.
తెలంగాణలో డిగ్రీ కాలేజీ ల్లో అడ్మిషన్ల గడువు పెంపు
దోస్త్ మొదటి దశ లో నమోదు చేసుకోవడానికి 08/09/2020 పొడిగించబడింది
వెబ్ ఆప్షన్లు చాలా తక్కువమంది ఇచ్చుకోవడం తో తేదీ పొడిగింపు
విద్యార్థుల అభ్యర్థన మేరకు దోస్తు నిర్ణయం
వెబ్ ఆప్షన్ను ఉపయోగించిన విద్యార్థులు మరోసారి దోస్త్ వెబ్ సైట్
వేముల ప్రశాంత్ రెడ్డి శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వ్యాఖ్యలు:
సభ్యులందరిని విప్ లు సమన్వయ పరుచుకోవాలి
అంశాలవారిగా సభలో అర్థవంతమైన చర్చలు జరిగేందుకు కృషి చేయాలి
శాసనసభ,శాసన మండలి చీఫ్ విప్,విప్ లతో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమయ్యారు.
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు,ప్రభుత్వ పాలసీలు,
ప్రజా సమస్యలపై ఉభయసభల వేదికగా అర్థవంతమైన విస్తృత చర్చలు జరిగేందుకు ప్రభుత్వ చీఫ్ విప్,విప్ లు కీలక పాత్ర పోషించాలన్నారు.
పలు స్వల్పకాలిక,లఘు చర్చలపై విప్ లు అంశాల వారిగా సన్నద్ధం కావాలి. సభ్యులందరి హాజరును పర్యవేక్షించాలి.
సభలో చర్చించేందుకు విప్ లకు కేటాయించిన ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో సమాయత్తంగా ఉండాలి..
చర్చలో పాల్గొనే సభ్యులను అంశాల వారిగా విప్ లు వారిని సమన్వయ పరుచుకోవాలన్నారు.
అన్ని అంశాలను సభా వేదికగా ప్రజలకు వివరించేందుకు సభను ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి పూర్తి సుముఖంగా ఉన్నారు.
అందరం పూర్తి బాధ్యత యుతంగా వ్యవహరించాలి.
ప్రజలకు సులభతరంగా అర్ధమయ్యే రీతిలో సభలో అర్థవంతమైన చర్చ జరిగేందుకు కృషి చేయాలి.
సమావేశంలో చీఫ్ విప్ లు బోడకుంటి వెంకటేశ్వర్లు,దాస్యం వినయ్ భాస్కర్ విప్ లు బానుప్రసాదరావు,ఎమ్.ఎస్ ప్రభాకర్,శాసనసభ విప్ లు గంప గోవర్ధన్, గొంగిడి సునీత, బాల్క సుమన్,రేగ కాంతారావు,గువ్వల బాలరాజు పాల్గొన్నారు.
తెలంగాణ..
-టీఎన్జీవో సంఘం లో అధ్యక్ష స్థానం తర్వాత అత్యంత కీలకమైన పోస్ట్ ప్రధాన కార్యదర్శి పదవి.
-వివిధ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడిన ఆర్ ప్రతాప్ ని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న టీఎన్జీవో కేంద్ర సంఘం
గన్ పార్క్..
జగ్గారెడ్డి.. కాంగ్రెస్ఎమ్మెల్యే
-టిఆర్ఎస్ మీడియా గొంతు నొక్కుతుంది..
-మీడియా కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ..ఉధ్యమంలో ఎప్పుడు అనుకోలేదు..
-తెలంగాణ ఉధ్యమంలో అమరవీరుల స్తూపమే మీడియా వేధిక... తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే అమరవీరుల స్తూపం వేధికైంది..
-యస్సీ వర్గీకరణ కోసం కృష్ణ మాధిగ 25 సంవంత్సరాలుగా పోరాడుతున్నారు.. అన్ని పార్టీ లు వివిధ సంధర్భాలలో మద్దతు ఇచ్చాయి..
-అసెంబ్లీ లో యస్సీ వర్గీకరణ పై తీర్మానం చేసిన తర్వాత కూడా ఏంధుకు ఆలస్యం అవుతుంది..
-యస్సీ వర్గీకరణ రాష్ర్టాల పరిధిలో చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది..
-ఈ సమావేశాలలో యస్సీ వర్గీకరణ అమలు చేయాలి డిమాండ్ చేస్తున్న.. ఈ అంశాన్ని అసెంబ్లీ లో ప్రస్తావిస్తా..
శ్రీకాకుళం జిల్లా..
-అవినీతి లేని పాలన అందిస్తానని తన ప్రమాణ స్వీకారం రోజునే వైఎస్ జగన్ చెప్పారు..
-భారతదేశంలోనే అవినీతి లేని పారకదర్శక పాలన అందిస్తున్నది వైసీపీ ప్రభుత్వం..
-అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానం ఏపీకి దక్కింది..
-ప్రభుత్వంలో భాగమైన ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలను సభాపతిగా అభినందిస్తున్నాను..
-ఎవరో కన్నబిడ్డను మా బాబు అని ముద్దాడుతున్నట్టు ఉండి టిడిపి వ్యవహారం..
-పేదవాడికి సొంత ఇళ్ళు ఇవ్వాలనె సదుద్దేశంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చూడితే తెలుగుదేశం ఏం చేసింది ?
-ఎక్కడైనా అవకతవకలు జరిగితే విమర్శించాలి.. ప్రతిపక్షం ఉంది అందుకే..
-కానీ మొత్తం పధకాన్నె రద్దు చేయాలి అనే విధంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం ప్రతిపక్షానికి తగునా ?
-కోర్టులకు వెళ్ళి ఎంతకాలం ఆపుతారు ?
-న్యాయస్థానాల ద్వారా ప్రభుత్వ పధకాలను అడ్డుకుంటున్న వారు అసలు రంగుతో ప్రజల ఎదుట దోషులుగా నిలబడే రోజు త్వరలోనే వస్తుంది..
-మేము మా నిర్ణయానికి కట్టుబడే ఉన్నాం.. కోర్టు ఎప్పుడు తీర్పునిస్తే అప్పుడే ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తాం..
-వైఎస్సార్ గృహ నిర్మాణ పధకం మంచిదా కాదా చెప్పాలి.. మంచిది కాదు అనుకుంటే కోర్టుల వరకు ఎందుకు మనమే ఆపేద్దాం..
-అవకాశం ఉండి చేయగలిగే శక్తి ఉంటే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారు.. లేకపోతే లేదు..
-కనిపించేదానికి గట్టెక్కి చూడడం దేనికి ?
-న్యాయస్థానాలు క్షుణ్ణంగా పరిశీలించి తీరు ఇచ్చాక దాని ప్రకారమే ముందుకు వెళదాం..
-రాజారెడ్డి వచ్చినా అమరావతి కదపలేరు అని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు..
-రాజారెడ్డి ఎందుకు కడుపుతారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కదుపుతారు..
-తల కిందకి, కాళ్ళు మీదకి వేసి మాట్లాడడం టిడిపి వాళ్ళకి మామూలే..
-మంచి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరుతున్నాం..
-ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి..
-కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే అంతిమం..
-మేము ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలా, లేక విమర్శలు చేస్తున్న వారి అభిప్రాయాలను గౌరవించాలా ?