Live Updates: ఈరోజు (సెప్టెంబర్-07) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-07 02:14 GMT
Live Updates - Page 2
2020-09-07 11:29 GMT

Telangana updates: స్పీకర్ ఛాంబర్ లో ప్రారంబమైన బీఏసీ సమావేశం.

తెలంగాణ..

-అసెంబ్లీ పనిదినాలు, సభలో చర్చించాల్సిన అంశాల పై చర్చ.

-బీఏసీ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి ప్రశాంత్ రెడ్డి, బట్టి విక్రమార్క , అక్బరుద్దీన్ , రాజసింగ్.

2020-09-07 11:26 GMT

Nizamabad updates: విఆర్వోల వద్ద నుంచి రికార్డులను స్వాధీనం చేసుకుంటున్న అధికారులు..

నిజామాబాద్..

-ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న రికార్డుల స్వాధీనం

-కార్యాలయం లోపలికి ఎవరిని అనుమతించని అధికారులు

-విఆర్వో వ్యవస్థ రద్దుపై చకచకా కొనసాగుతున్న ఫైళ్లు

2020-09-07 11:12 GMT

Telangana updates: గత వారమే అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపి వేయాలని ఆదేశాలు జారి...

-రేపటి నుండి అన్ని రకాల రిజిస్ట్రేషన్స్ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు

-ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ నుంచి నగరాల వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ జీవో జారి.

-ఇప్పుడు రెవెన్యూ సంస్కరణల నేపథ్యంలో అన్ని రకాల రిజిస్ట్రేషన్లు నిలిపివేత

2020-09-07 10:57 GMT

Telangana updates: కోవిడ -19 గత ఆరు మాసాలుగా తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేసింది:-రావుల చంద్రశేఖర్ రెడ్డి..

-రావుల చంద్రశేఖర్ రెడ్డి టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు...

-కోవిడ్ -19 గత ఆరు మాసాలుగా తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేసింది .చేతివృత్తుల వారు , కుల వృత్తుల వారు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల   చాలా దెబ్బతిన్నారు ..

-రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య దాదాపు లక్షా 50 వేలకు చేరుకుంటున్నది . మరణాలు కూడా వెయ్యికి చేరువయ్యాయి..

-రాష్ట్రంలో కరోనాకు చికిత్స అందించే వైద్య సిబ్బంది మరణించినా రూ .50 లక్షల ఎక్స్ గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి.

-కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన ప్రతీ పేద కుటుంబానికి సత్వరం కనీసం రూ .10 వేలు ఆర్థిక సహాయం చేయాలి.

-కరోనా మహమ్మారివల్ల మరణించిన పేదల కుటుంబాలకు రూ . 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలి ..

-కోవిడ్ -19 చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్

-శాసనసభ సమావేశాలలో కోవిడ్ -19 మహమ్మారిపై సమగ్ర చర్చ జరపాలి .

2020-09-07 10:21 GMT

Hyderabad updates: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ముసలం..

రాచకొండ కమిషనరేట్..

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అజారుద్దీన్ ఉప్పల్ పొలిసులకు పిర్యాదు.

ఇరువర్గాలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఉప్పల్ పోలీసులు..

పోలీస్ స్టేషన్ లొనే బాహా బాహికి దిగిన ఇరువర్గాలు.

2020-09-07 10:08 GMT

Telangana updates:ఈ ఏడాది బతుకమ్మ పండుగ తేదీల గురించి అనేకమంది మెస్సేజ్ లు చేస్తున్నారు:కల్వకుంట్ల కవిత..

కల్వకుంట్ల కవిత మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.

-ఈ ఏడాది బతుకమ్మ పండుగ తేదీల గురించి అనేకమంది మెస్సేజ్ లు చేస్తున్నారు.

-ఈ సారి బతుకమ్మ పండుగ తేదీలు: అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 24 వరకు.

2020-09-07 09:59 GMT

ACB updates: కీసర తహసీల్దార్ కేసులో ఏసీబీ విచారణ వేగవంతం...

ఏసీబీ అప్ డేట్స్.....

-కీసర రెవెన్యూ పరిధిలో కోటి పది లక్షల లంచం తీసుకుంటూ కీసర మాజీ ఎమ్మార్వో ఈ. బి నాగరాజు అవినీతి కేసుల లో రియల్టర్లు అంజి రెడ్డి ,శ్రీనాథ్ కూ     ల్యాండ్  అగ్రిమెంట్ చేసిన ఏక్బాల్ అనే వ్యక్తి తన నివాసం బోగారంలో ఏసీబీ సోదాలు.

2020-09-07 09:28 GMT

TS High court: గాంధీ, ఉస్మానియా ఆస్పత్రి లలో కోవిడ్ పరీక్షలు చేయడం లేదని ధాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ....

టీఎస్ హైకోర్టు....

కరోనా లక్షణాలు ఉన్న వారికి సైతం గాంధీ ఉస్మానియా లో పరీక్షలు చేయట్లేదని కోర్టుకు తెలిపిన పిటీషనర్..

ప్రతి ప్రభుత్వ , ప్రైవేట్ హాస్పిటల్ లలో హై కోర్ట్ ఆదేశాలు ఇచ్చినా ఇంకా బెడ్స్ వివరాలు డిస్ ప్లే పేటడం లేదని కోర్టు కు తెలిపిన పిటీషనర్..

కరోనా బారిన పడిన పేషంట్ల కోసం 104 హెల్ప్ లైన్ నంబర్ సేవలను ఉపోయోగించెల ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు తెలిపిన పిటీషనర్...

దీనిపై విచారించిన కోర్ట్..

తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు అదేశం...

తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసిన హైకోర్టు.

2020-09-07 09:14 GMT

Telangana updates: రెవెన్యూ వ్యవస్థల ప్రక్షాళన, చట్టాల మార్పును మేము స్వాగతిస్తున్నాం:-సుధాకర్..

-విఆర్వో సంఘం ప్రధాన కార్యదర్శి సుధాకర్..

-విరోఓ వ్యవస్థ రద్దు చేసిన మమ్మల్ని రెవెన్యూ లోనే కొనసాగించాలి..

-ఇతర డిపార్ట్మెంట్ లో కి వెళితే మాకు ఆత్మ గౌరవ సమస్య వస్తుంది..

-మా పై అవినీతి ముద్ర వేయడం బాధాకరం..

-టెస్రా ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి...

-బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మార్చడం మంచిదే.

-కాలానుగుణంగా చట్టాలు మార్చాల్సిందే.

-ముఖ్యమంత్రి కేసీఆర్ మారిన కాలానికి అనుగుణంగా నూతన రెవెన్యూ చట్టాలను తీసుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం.

-విఆర్ఓ వ్యవస్థ ను రద్దు చేస్తామని ప్రభుత్వం ఎక్కడ ప్రకటించలేదు.

-వారి అధికారాలను తగ్గిస్తారా లేదా పూర్తిగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తారా అంశం పై క్లారిటీ వచ్చిన తరువాత స్పందిస్తాం..

-Vro సంఘం ప్రధాన కార్యదర్శి సుధాకర్...

-మాకు రికార్డులు అప్పజెప్పేందుకు అభ్యంతరం లేదు..

-కానీ మమ్మల్ని దొంగల చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు..

-ముందుగా మమ్మల్ని ఏ డిపార్ట్మెంట్ బదిలీ చేస్తారో చెప్పాలి...

-అది చెప్పకుండా రికార్డులు బదిలీ చేయమని చెప్పడం భావ్యం కాదు...

2020-09-07 09:08 GMT

Cyberabad updates: రాత్రుళ్ళు ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఆవుల కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసాం.

సజ్జనార్, సైబరాబాద్ సీపీ...

-గత 7సంవత్సరాల నించి 90 కేసుల్లో నిందితుడు.

-ఇటీవల ఖమ్మం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. జులై లో విడుదల అయి మళ్ళీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

-రెక్కీ నిర్వహించి చోరి చేయడం ఇతని నైజం. నంబర్ ప్లేట్ లేని వాహనం, నల్ల హెల్మెట్ వాడుతూ చోరీలు చేస్తున్నాడు.

-సీసీటీవీ కెమెరాల ద్వారా ఇతన్ని పట్టుకున్నాం.

-16.70 లక్షల విలువ చేసే 39గ్రాముల బంగారం,829 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నాం.

-మరో 60తులాల బంగారం రికవరీ చేయాల్సి ఉంది.

Tags:    

Similar News