Srikakulam updates: స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..

శ్రీకాకుళం జిల్లా..

-అవినీతి లేని పాలన అందిస్తానని తన ప్రమాణ స్వీకారం రోజునే వైఎస్ జగన్ చెప్పారు..

-భారతదేశంలోనే అవినీతి లేని పారకదర్శక పాలన అందిస్తున్నది వైసీపీ ప్రభుత్వం..

-అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానం ఏపీకి దక్కింది..

-ప్రభుత్వంలో భాగమైన ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలను సభాపతిగా అభినందిస్తున్నాను..

-ఎవరో కన్నబిడ్డను మా బాబు అని ముద్దాడుతున్నట్టు ఉండి టిడిపి వ్యవహారం..

-పేదవాడికి సొంత ఇళ్ళు ఇవ్వాలనె సదుద్దేశంతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చూడితే తెలుగుదేశం ఏం చేసింది ?

-ఎక్కడైనా అవకతవకలు జరిగితే విమర్శించాలి.. ప్రతిపక్షం ఉంది అందుకే..

-కానీ మొత్తం పధకాన్నె రద్దు చేయాలి అనే విధంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం ప్రతిపక్షానికి తగునా ?

-కోర్టులకు వెళ్ళి ఎంతకాలం ఆపుతారు ?

-న్యాయస్థానాల ద్వారా ప్రభుత్వ పధకాలను అడ్డుకుంటున్న వారు అసలు రంగుతో ప్రజల ఎదుట దోషులుగా నిలబడే రోజు త్వరలోనే వస్తుంది..

-మేము మా నిర్ణయానికి కట్టుబడే ఉన్నాం.. కోర్టు ఎప్పుడు తీర్పునిస్తే అప్పుడే ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తాం..

-వైఎస్సార్ గృహ నిర్మాణ పధకం మంచిదా కాదా చెప్పాలి.. మంచిది కాదు అనుకుంటే కోర్టుల వరకు ఎందుకు మనమే ఆపేద్దాం..

-అవకాశం ఉండి చేయగలిగే శక్తి ఉంటే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారు.. లేకపోతే లేదు..

-కనిపించేదానికి గట్టెక్కి చూడడం దేనికి ?

-న్యాయస్థానాలు క్షుణ్ణంగా పరిశీలించి తీరు ఇచ్చాక దాని ప్రకారమే ముందుకు వెళదాం..

-రాజారెడ్డి వచ్చినా అమరావతి కదపలేరు అని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు..

-రాజారెడ్డి ఎందుకు కడుపుతారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కదుపుతారు..

-తల కిందకి, కాళ్ళు మీదకి వేసి మాట్లాడడం టిడిపి వాళ్ళకి మామూలే..

-మంచి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరుతున్నాం..

-ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి..

-కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే అంతిమం..

-మేము ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలా, లేక విమర్శలు చేస్తున్న వారి అభిప్రాయాలను గౌరవించాలా ?

Update: 2020-09-07 11:43 GMT

Linked news