Vemula Prashanth Reddy:కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు: వేముల ప్రశాంత్ రెడ్డి
వేముల ప్రశాంత్ రెడ్డి శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వ్యాఖ్యలు:
సభ్యులందరిని విప్ లు సమన్వయ పరుచుకోవాలి
అంశాలవారిగా సభలో అర్థవంతమైన చర్చలు జరిగేందుకు కృషి చేయాలి
శాసనసభ,శాసన మండలి చీఫ్ విప్,విప్ లతో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమయ్యారు.
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు,ప్రభుత్వ పాలసీలు,
ప్రజా సమస్యలపై ఉభయసభల వేదికగా అర్థవంతమైన విస్తృత చర్చలు జరిగేందుకు ప్రభుత్వ చీఫ్ విప్,విప్ లు కీలక పాత్ర పోషించాలన్నారు.
పలు స్వల్పకాలిక,లఘు చర్చలపై విప్ లు అంశాల వారిగా సన్నద్ధం కావాలి. సభ్యులందరి హాజరును పర్యవేక్షించాలి.
సభలో చర్చించేందుకు విప్ లకు కేటాయించిన ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో సమాయత్తంగా ఉండాలి..
చర్చలో పాల్గొనే సభ్యులను అంశాల వారిగా విప్ లు వారిని సమన్వయ పరుచుకోవాలన్నారు.
అన్ని అంశాలను సభా వేదికగా ప్రజలకు వివరించేందుకు సభను ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి పూర్తి సుముఖంగా ఉన్నారు.
అందరం పూర్తి బాధ్యత యుతంగా వ్యవహరించాలి.
ప్రజలకు సులభతరంగా అర్ధమయ్యే రీతిలో సభలో అర్థవంతమైన చర్చ జరిగేందుకు కృషి చేయాలి.
సమావేశంలో చీఫ్ విప్ లు బోడకుంటి వెంకటేశ్వర్లు,దాస్యం వినయ్ భాస్కర్ విప్ లు బానుప్రసాదరావు,ఎమ్.ఎస్ ప్రభాకర్,శాసనసభ విప్ లు గంప గోవర్ధన్, గొంగిడి సునీత, బాల్క సుమన్,రేగ కాంతారావు,గువ్వల బాలరాజు పాల్గొన్నారు.