Telangana updates: ముఖ్యమంత్రి కేసీఆర్ పాత, కొత్త తరాలకు,భవిష్యత్ తరాలకు క్షమాపణ చెప్పాలి..
బీజేపీ మీడియా స్టేట్మెంట్
కె కృష్ణసాగర రావు..బీజేపీ
ముఖ్య అధికార ప్రతినిధి,
-కేసీఆర్ వాస్తవ తెలంగాణ చరిత్రని తక్కువ చేసి చూస్తున్నారు. ఆయన తన స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చరిత్రను వక్రీకరించి కొత్త భాష్యం చెప్తున్నారు.
-తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17 ని అధికారికంగా చారిత్రాత్మక దినోత్సవంగా ప్రకటించి ఎందుకు నిర్వహించడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
-కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేకన్నా ముందు ఈ పండగను నిర్వహించాలని డిమాండ్ చేసి సడెన్ గా ఎందుకు యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి.
-తెలంగాణ ప్రజల మీద పేదలు, అణగారిన వర్గాల మీద నిజాం అతడి రజాకారుల సైన్యం చేసిన దుర్మార్గాల్ని ఆయన గుర్తిస్తున్నారా లేదా..? అలాగే నిజాంలు విదేశీ ఆక్రమణదారులే తప్ప స్వదేశీయులు కాదన్న విషయం సీఎం కేసీఆర్ కు తెలుసా..?తెలియదా..?.
-ఈ వందల ఏళ్ల విదేశీ పాలన సెప్టెంబర్ 17 ,1948 రోజున అంతమయ్యిందన్న విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకుంటారా..? లేదా..?.
-ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ ప్రతీసారి అనేక వేదికల మీద తాను ముఖ్యమంత్రి అయితే గనుక సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవం గా జరుపుతానని ప్రకటించారు.
-మరి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పిన ఈ వ్యక్తిని ఏమని పిలవాలి..?.
-తెలంగాణ స్వాతంత్ర్యం కోసం నిజాం రాజుకి వ్యతిరేకంగా పోరాడిన ఎందరో స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలకు విలువ లేకుండా చేసి కేవలం ముస్లింలను ఓట్ల కోసం కేసీఆర్ ఇదంతా చేస్తున్నారు.
-తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17 ని తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు చేస్తాము. సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ కు ఎంతో ప్రత్యేకమైన రోజు. ప్రతీసారి సెప్టెంబర్ 17 ని ఆగస్టు 15 స్థాయిలో తెలంగాణలో నిర్వహిస్తాం.
-నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు చిహ్నంగా స్మారక స్తూపం ఒకటి భారీ ఎత్తున హైదరాబాద్ నడిబొడ్డున నిర్మిస్తాం. తెలంగాణ కు నిజమైన స్వాతంత్య్రం సెప్టెంబర్ 17 నే. కావాలంటే ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ బహిరంగంగా తిరస్కరించమని బీజేపీ ఛాలెంజ్ చేస్తుంది.