Live Updates: ఈరోజు (సెప్టెంబర్-05) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-05 01:45 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 05 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-తదియ (మ.2-09 వరకు) తదుపరి చవితి, రేవతి నక్షత్రం (రా.1-08 వరకు) తదుపరి అశ్విని, అమృత ఘడియలు (రా.10-29 నుంచి 12-15 వరకు) వర్జ్యం (ఉ.11-52 నుంచి 1-38 వరకు) దుర్ముహూర్తం (ఉ.5-49 నుంచి 7-27 వరకు) రాహుకాలం (ఉ.9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-09

ఈరోజు తాజా వార్తలు 

Live Updates
2020-09-05 13:19 GMT

అమరావతి:

- స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ ను మరింత పకడ్బందీగా ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.

- ఉచిత విద్యుత్ విషయంలో తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ చెప్పారు..

- ప్రజలకు మేలు జరుగుతుందని నగదు బదిలీ చేస్తున్నారు..

- కేంద్ర సంస్కరణల్లో భాగంగానే నగదు బదిలీ నిర్ణయం తీసుకున్నారు..

- మీటర్లు డిస్కములు ఏర్పాటు చేస్తాయి..

- మీటర్లుకు రైతులు ఒక పైసా కట్టనక్కరలేదు..

- ఉచిత విద్యుత్ తో చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు..

- నగదు బదిలీ కాదు ఉరి తాడు అంటున్నాడు..

- నగదు బదిలీ గురించి 2014 ఎన్నికలకు ముందు గొప్పగా చంద్రబాబు చెప్పారు..

- నగదు బదిలీ పథకాన్ని లోకేష్ రూపకల్పన చేశారన్నారు..

- నగదు బదిలీ డబ్బు డిస్కములకు వెళ్తుంది..

- రైతులు వాడడానికి, బాంక్ లు జమ చేసుకోవడానికి వీల్లేదు..

- నగదు జమ వలన ఎంత విద్యుత్ ఉపయోగించమో తెలుస్తోంది..

- నాణ్యమైన విద్యుత్ అడగడానికి అవకాశం రైతులకు ఉంటుంది..

2020-09-05 12:51 GMT

యాదాద్రి-భువనగిరి :

- చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం.

- ఆవును తప్పించబోయి సడెన్ బ్రేక్ వేసిన కాన్వాయ్ లోని ముందు వాహనం.

- ఒక్కసారిగా కాన్వాయ్ లోని ముందు ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం.

- తర్వాతి వాహనంలో ఉన్న చంద్రబాబు క్షేమం.

- దెబ్బతిన్న వాహనం ముందు భాగం, స్వల్పగాయాలతో మరో వాహనంలో వెళ్లిన భద్రతా సిబ్బంది.

- అమరావతి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం.

2020-09-05 12:25 GMT

- హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ప్రధాన మంత్రి అవాస్ యోజన, పీఎంస్వపై రెవెన్యూ, జీహెచ్ఎంసీ,బ్యాంకర్స్ తో సమీక్షించా 

- వీధి వ్యాపారులందరూ రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడగించాం

- రాష్ట్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి

- రెండు లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని ఆదేశించా

- ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు

- కేంద్ర నిధులను సైతం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికే వెచ్చిస్తోంది

- కేంద్ర ప్రభుత్వం నాలుగు రకాల వడ్డీ రాయితీలు కల్పిస్తుంది

- హైదరాబాద్లో సొంత స్థలం ఉన్న వాళ్లఅందరికి సబ్సిడీతో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తున్నాం

- కేంద్రం వెల్ నెస్ కేంద్రాలను, కేంద్ర ప్రభుత్వం బస్తీ దావాఖానాల నిర్వహహణ కు నిధులు ఇస్తుంది

- బస్తీ దవాఖానాలు సమర్ధవంతంగా పని చేయాలి

- 168 బస్తీ దవాఖానాలను కేంద్రం హైదరాబాద్ నగరానికి మంజూరు చేసింది

- వీటి పూర్తి నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుంది 

2020-09-05 12:06 GMT

- ఈ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారు

- గ్రేటర్ ను ఇస్తాంబుల్ చేస్తామని, ట్యాంక్ బండ్ లో నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తామని, లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారు..

- అందమైన అబద్దాలు చెప్పి 99 డివిజన్లలో కార్పొరేటర్లను గెలుచుకున్నారు.

- గ్రేటర్ లో ఇప్పటివరకు కేవలం 128 ఇండ్లు మాత్రమే కట్టారు.

- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల కిరాయి రూపంలో పేదల పై 1200కోట్ల భారం పడింది.

- లాక్ డౌన్ లో విద్యుత్ భారం, ఇంటి పన్ను భారం పడింది.

- అద్భుతాలు సృష్టించినట్లు కేటీఆర్ గొప్పలు చెబుతున్నారు.

- వారి బంధువుల రియల్ ఎస్టేట్, అపార్ట్ మెంట్ వ్యాపారాలు ఉన్న దగ్గర మాత్రమే రోడ్లు వేశారు

- పేద ప్రజలకు ఉపయోగపడే చోట ఎక్కడా రోడ్లు వేయలేదు..

- కేసీఆర్ సచివాలయం కూల్చుడు, ప్రగతి భవన్ కట్టుడు తప్పా ఏమీ చేయలేదు..

- మున్సిపల్ మంత్రి గా విఫలమైన కేటీఆర్ కు ఓటు అడిగే హక్కు లేదు..

- అక్టోబర్ 3నుంచి  పార్లమెంట్ పరిధిలో డివిజన్ యాత్ర చేపడుతున్న

- ఉదయం ఒక డివిజన్, సాయంత్రం ఒక డివిజన్ తిరుగుతా..

- టిఆర్ఎస్ విస్మరించిన హామీల పై ప్రజలను చైతన్య పరుస్తా..

- కేటీఆర్ ముక్కుమూసుకోకుండా మూసీ వెంట తిరిగితే దేనికైనా మేము రెడీ 

2020-09-05 08:40 GMT

. రిస్క్ తీసుకుని ఆసుపత్రులు సందర్శించిన భట్టి ని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు అభినందించారు 

. హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వం ని చివాట్లు పెట్టింది

కేసీఆర్ కి సిగ్గు వస్తలేదా..?

హైకోర్టు తిట్టింది.. గవర్నర్ తిట్టింది... అయినా సిగ్గురాలేదు

. మేము మాట్లాడితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు

ఇన్నీ తిట్లు తింటూ... మంత్రి పదవి లో ఎందుకు ఉంటున్నావ్ ఈటెల రాజేందర్

. మరణాలు తక్కువ చేసి చెప్తున్నావ్ అని కోర్ట్ తిట్టినా సిగ్గురాలేదు

. ప్రజల మరణాలు తక్కువ చేసి చూపెట్టినందుకు సిగ్గుపడాలి

. ప్రయివేటు ఆసుపత్రుల నుండి సూటి కేసులు... ఈటెల ఇంటికి వస్తున్నాయా..? సీఎం ఇంటికి పోతున్నాయా..?

లక్షల బిల్లులు వేస్తుంటే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో చెప్పాలి

మీకు అందుతున్న కమిషన్ ఎంత..?

ఇన్నాళ్లు కాంట్రాక్టర్ల కమిషన్ ల కోసం..ఇప్పుడు ప్రయివేటు ఆసుపత్రుల నుండి కమిషన్ తీసుకుంటున్నారా..?

ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరా బాద్ లొనే ఆసుపత్రి నడపలేనోడు... రాష్ట్రాన్ని నడిపిస్తాడా..?

. హుజురా బాద్ ఆసుపత్రిలోనే సిబ్బంది కొరత ను తీర్చలేక పోయాడు ఈటెల

హుజుర్ నగర్ లో ఈటెల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు

. తప్పుడు లెక్కలు చూపించకుంటే ప్రభుత్వ సిబ్బందిని సస్పెండ్ చేశాడు

. ప్రవీణ్ యాదవ్ ని ..ఈటెల రాజేందర్ చంపించారు

. ప్రవీణ్ యాదవ్ ని పోలీస్ స్టేషన్ లో చిత్ర వదలు చేసి చంపించాడు ఈటెల రాజేందర్

. ప్రశ్నించిన కౌశిక్..మీద కేసులు పెట్టారు

. ఆసుపత్రి అధికారుల ను... భట్టి, కౌశిక్ నిలదీస్తే..కౌశిక్ మీదే ఎందుకు కేసు పెట్టారు

. కరోనా లొనే కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం బయట పడింది

2020-09-05 08:13 GMT

భట్టి విక్రమార్క.. సీఎల్పీ నేత.

ఈ నెల 26 నుండి రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుత్రులను సందర్శించాం.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది

రాష్ట్రంలో ఎక్కడ కేసీఆర్ ప్రభుత్వం కొత్త పరికరాలు కొనుగోలు చెయ్యలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు చేసిన పరికారాలే ఉన్నాయి.

చాలా ఆసుపత్రుల్లో యంత్ర సామగ్రి , సిబ్బంది సరిగా లేరు.

ఆరున్నర సంవత్సరాల నుండి trs ప్రభుత్వం వైద్య సిబందీని ఎందుకు నియమించుకోలేదు.

ఉద్యమం ఉద్యోగాల కోసమే చేశామని చెప్పిన మంత్రి ఈటెల రాజేందర్ ఆయన శాఖ లో ఉన్న ఉద్యోగాలే ఖాళీలే భర్తీ చేయలేదు.

2020-09-05 08:08 GMT

 అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనసభ మండలికి హాజరవుతున్న సభ్యులు కరోనా విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.

Icmr గైడ్ లైన్స్ ప్రకారం 60 ఏళ్లు పైబడ్డ వారు కరోన వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

శాసనమండలిలో మొత్తం 36 మంది ఎమ్మెల్సీ సభ్యుల గాను 20 మంది సభ్యులు 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు.

శాసనసభలో మొత్తం 119 మందికి గాను. 36 మంది ఎమ్మెల్యేలు 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు.

అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,  డిప్యూటీ స్పీకర్ పద్మారావు,  మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, సీఎం కేసీఆర్.

మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ మల్లారెడ్డి , నిరంజన్ రెడ్డి ఎర్రబెల్లి దయాకరరావు, మహమూద్ అలీ 60 ఏళ్ల పైబడిన వారిలో ఉన్నారు .

2020-09-05 07:50 GMT

పెద్దపల్లి : సుల్తానాబాద్ మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో కరోన కలకలం....

సర్వ సభ్య సమావేశంలో నడుస్తున్న సమయంలో ఓ ప్రజాప్రతినిధి భర్త కు కరోనా పాజిటివ్ మెస్సేజ్...

వైరస్ పాజిటివ్ ఉండటం తో ఆమె సర్వసభ్య సమావేశనికి హాజరుకాగా బయటకు వచ్చిన మిగితా ప్రజాప్రతినిధులు....

2020-09-05 07:15 GMT

 ఖైరతాబాద్: ఖైరతాబాద్ RTA ఆఫీస్ దగ్గర ప్రైవేట్ వెహికిల్స్ అసోసియేషన్స్ ధర్నా

టాక్స్ ల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి ధర్నా

కరోన తో వాహనాలు ఆగిపోయాయి టాక్స్ లు ఎక్కడినుండి కట్టాలని ఆందోళనా

టాక్స్ ను మాఫీ చేయాలని ప్రభుత్వం నికి వినతి

2020-09-05 07:09 GMT

కరీంనగర్ : కరీంనగర్ నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం లో ప్రోటోకాల్ రగడ

మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ ..,మేయర్ సునీల్ రావు వాగ్వాదం

మీడియా ని అనుమతించకపోవడం పై బిజెపి కార్పొరేటర్ ల నిరసన

199 అంశాలు ఒకేరోజు సమావేశం పెడితే ఎలా చర్చిస్తారని బీజేపీ కార్పొరేటర్ ల ఆగ్రహం

Tags:    

Similar News