Reventh Reddy on TRS Govt: ఆరు నెలల్లో ఖమ్మం, వరంగల్, జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్నాయి: రేవంత్ రెడ్డి
- ఈ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారు
- గ్రేటర్ ను ఇస్తాంబుల్ చేస్తామని, ట్యాంక్ బండ్ లో నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తామని, లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారు..
- అందమైన అబద్దాలు చెప్పి 99 డివిజన్లలో కార్పొరేటర్లను గెలుచుకున్నారు.
- గ్రేటర్ లో ఇప్పటివరకు కేవలం 128 ఇండ్లు మాత్రమే కట్టారు.
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల కిరాయి రూపంలో పేదల పై 1200కోట్ల భారం పడింది.
- లాక్ డౌన్ లో విద్యుత్ భారం, ఇంటి పన్ను భారం పడింది.
- అద్భుతాలు సృష్టించినట్లు కేటీఆర్ గొప్పలు చెబుతున్నారు.
- వారి బంధువుల రియల్ ఎస్టేట్, అపార్ట్ మెంట్ వ్యాపారాలు ఉన్న దగ్గర మాత్రమే రోడ్లు వేశారు
- పేద ప్రజలకు ఉపయోగపడే చోట ఎక్కడా రోడ్లు వేయలేదు..
- కేసీఆర్ సచివాలయం కూల్చుడు, ప్రగతి భవన్ కట్టుడు తప్పా ఏమీ చేయలేదు..
- మున్సిపల్ మంత్రి గా విఫలమైన కేటీఆర్ కు ఓటు అడిగే హక్కు లేదు..
- అక్టోబర్ 3నుంచి పార్లమెంట్ పరిధిలో డివిజన్ యాత్ర చేపడుతున్న
- ఉదయం ఒక డివిజన్, సాయంత్రం ఒక డివిజన్ తిరుగుతా..
- టిఆర్ఎస్ విస్మరించిన హామీల పై ప్రజలను చైతన్య పరుస్తా..
- కేటీఆర్ ముక్కుమూసుకోకుండా మూసీ వెంట తిరిగితే దేనికైనా మేము రెడీ