Amravati Updates: ఉచిత విద్యుత్ ను మరింత పకడ్బందీగా ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు: బొత్స సత్యనారాయణ
అమరావతి:
- స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ ను మరింత పకడ్బందీగా ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
- ఉచిత విద్యుత్ విషయంలో తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ చెప్పారు..
- ప్రజలకు మేలు జరుగుతుందని నగదు బదిలీ చేస్తున్నారు..
- కేంద్ర సంస్కరణల్లో భాగంగానే నగదు బదిలీ నిర్ణయం తీసుకున్నారు..
- మీటర్లు డిస్కములు ఏర్పాటు చేస్తాయి..
- మీటర్లుకు రైతులు ఒక పైసా కట్టనక్కరలేదు..
- ఉచిత విద్యుత్ తో చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు..
- నగదు బదిలీ కాదు ఉరి తాడు అంటున్నాడు..
- నగదు బదిలీ గురించి 2014 ఎన్నికలకు ముందు గొప్పగా చంద్రబాబు చెప్పారు..
- నగదు బదిలీ పథకాన్ని లోకేష్ రూపకల్పన చేశారన్నారు..
- నగదు బదిలీ డబ్బు డిస్కములకు వెళ్తుంది..
- రైతులు వాడడానికి, బాంక్ లు జమ చేసుకోవడానికి వీల్లేదు..
- నగదు జమ వలన ఎంత విద్యుత్ ఉపయోగించమో తెలుస్తోంది..
- నాణ్యమైన విద్యుత్ అడగడానికి అవకాశం రైతులకు ఉంటుంది..