Private Teachers Protest: డీఈఓ ఆఫీసును ముట్టడించిన ప్రైవేటు స్కూల్ టీచర్స్
హైదరాబాద్ లోని డీఈఓ ఆఫీసును ముట్టడించిన ప్రైవేటు స్కూల్ టీచర్స్
ప్రైవేటు టీచర్ల ను ప్రభుత్వం ఆదుకోవాలని, యాజమాన్యాలు పూర్తి వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆందోళన
సెప్టెంబర్ 5 న టీచర్స్ డే...ప్రైవేటు టీచర్లకు బ్లాక్ డే అంటూ నినాదాలు చేస్తూ వచ్చిన ప్రైవేటు టీచర్ల ఫోరమ్
Keesara MRO Case Updates: ఏసీబీ కీసర కేసు అప్ డేట్స్
కీసర తహసీల్దార్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం...
ఇప్పటికే నిందితుల బెయిల్ పిటీషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్ట్...
నిందితులను మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్న ఏసీబీ..
పై స్థాయి అధికారుల పాత్ర పై ఏసీబీ ఆరా...
త్వరలో పైస్థాయి అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించనున్న ఏసీబీ.
Lakshmi Barraiage: జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ బ్యారేజ్అప్ డేట్స్
- 75 గేట్లు ఎత్తిన అధికారులు
- పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
- ప్రస్తుత సామర్థ్యం 91.50 మీటర్లు
- పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
- ప్రస్తుత సామర్థ్యం 1.206 టీఎంసీ
- ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2,00,800 క్యూసెక్కులు
Teachers Day: ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపిన విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు!
- సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల ను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు మరవలేము
- ప్రస్తుతం కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారి సేవలు అనిర్వచనీయం...
- విద్యార్థుల భవిష్యత్తు కోసం డిజిటల్, ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయం
Adilabad District updates: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల హై అలర్ట్
- నాలుగురోజులుగా అసిపాబాద్ లో మకాం వేసి పోలీసుల కూంబింగ్ అపరేషన్ పర్యవేక్షిస్తున్నా డిజిపి మహేందర్ రెడ్డి
- మావోయిస్టు నాయకుడు బాస్కర్, కమీటి సభ్యుల కోసం అపరేషన్ నిర్వహిస్తున్నా పోలీసులు..
- తిర్యాణిలో గత జూలై నెలలో త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టు నాయకుడు బాస్కర్, కమిటీ సభ్యులు
- ఎజన్సీ పద్దెనిమిది మండలాల్లో కోనసాగుతున్నా కూంబింగ్..
- అడవులను అణుఅణువునా మావోలకోసం జల్లేడ పడుతున్న పోలీసులు.
- ప్రాణహిత సరిహద్దు ప్రాంతమైనా కౌటలా ,చింతలమానే పల్లి, బెజ్జూర్ మండలాల్లో కొనసాగుతున్న కూంబింగ్..
- మావోలు సరిహద్దు దాటకుండా పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తున్న పోలీసులు .