Live Updates: ఈరోజు (01 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 01 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పాడ్యమి రా.9-07 తదుపరి విదియ | భరణి నక్షత్రం రా.8-26 తదుపరి కృత్తిక | వర్జ్యం ఉ.శే.6-15 వరకు | అమృత ఘడియలు మ.3-07 నుంచి 4-53 వరకు | దుర్ముహూర్తం సా.3-55 నుంచి 4-41 వరకు | రాహుకాలం సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
ఈరోజు తాజా వార్తలు
విశాఖ జిల్లా...
* విశాఖ జిల్లా గాజువాకలో ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన వరలక్ష్మీ కుటుంబాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పరామర్శించారు.
* ఘటన పైశాచికమైనదని.తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.
* బాధితురాలి కుటంబానికి సీఎం జగన్ పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారని, తనవంతు సహాయ సహకారాలు అంద చేస్తానని హామీ ఇచ్చారు.
* దిశ యాప్ పై ప్రతి ఆడపిల్ల అవగాహాన పెంచుకోవాలని, తక్షణ సాయం కోసం ఆపదలో వున్నప్పుడు పోలిసులను సంప్రదించాలని నాగిరెడ్డి తెలిపారు.
విశాఖ
* విశాఖలో సంచలనం సృష్టించిన వరలక్ష్మి హత్య కేసులో నగర కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సంచలన విషయాలు వెల్లడించారు.
* నిందితుడు అఖిల్ పథకం ప్రకారమే వరలక్ష్మిని హత్య చేశాడని తెలిపారు.
* దాడి అనంతరం తప్పించుకునేందుకు కథలు చెప్పే ప్రయత్నం చేశాడని, ఘటనలో మరొకరి ప్రమేయం ఉన్నట్లు ఇప్పటి వరకూ తేలలేదన్నారు.
* కేసుని దిశా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని వివరించారు.
- వైసీపీ సర్కార్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- జగన్ ప్రభుత్వం హిందుత్వన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు.
- అన్ని మతాలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వం కేవలం హిందూమతాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుందో ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉందన్న అయ్యన్న..
- దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, రథాలు తగులబెట్టినా, పట్టించుకునే నాధుడే లేడన్నారు.
- సింహాచలం భూములు దోపిడీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, తిరుమల వెంకటేశ్వరస్వామి భూములు అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని హందు దర్మాన్ని కాపాడుకోలని పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లా..
* కరోనాతో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి టిడిపి నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు.
* ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, డీఎడ్ అభ్యర్ధుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.
* రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది విద్యార్ధిని, విద్యార్ధులకు విద్యాబోధన చేస్తున్న ఐదు లక్షల మంది ఉపాధ్యాయులు జీతాలు లేక రోడ్డున పడ్డారన్నారు.
* చిన్నచిన్న వ్యాపారులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారన్నారు.
* అటువంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు..
అమరావతి..
-వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి
-చంద్రబాబు 5 ఏళ్లలో నిర్వీర్యం చేసే విదంగా నవనిర్మాణ దీక్ష అంటూ పోట్టి శ్రీరాములు ఆత్మత్యాగాన్ని మరచారు
-ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోయింది... అందుకే నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినాన్ని పాటించాలని చాలా మంది కోరారు
-కొన్ని పత్రికలు వార్తలు రాశారు...అంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు జరపాలా..?
-ఏపీ నుంచి తెలంగాణా విడిపోయింది కానీ ఏపీ ఎక్కడ విభజన జరగలేదు
-చంద్రబాబు చేసిన దీక్షలు మేమూ చేయాలన్నా మీ కోరిక
-ఈ రోజు తెలుగు ప్రజలు పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు
నెల్లూరు..
- నగర హెల్త్ ఆఫీసర్ వెంకటరమణపై పందుల పెంపకదారులు దాడికి యత్నం..
- పందుల పట్టివేతపై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన వెంకటరమణ..
- పందుల పట్టివేతను అడ్డుకున్న పెంపకపుదారులు.. డాక్టర్ వెంకటరమణతో వాగ్వివాదం.
నెల్లూరు..
-- నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా అధికారులు, ప్రముఖులు.
-- అమరజీవి స్వగ్రామం బోగోలు మండలం జువ్వలదిన్నే స్మారక భవనంలో అమారజీవి కి ఘన నివాళులు. ప్రత్యేక సాంస్కతిక కార్యక్రమాలు.
-- జువ్వల దిన్నే లో శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించిన జిల్లా అమరజీవి స్మారక భవనం అధ్యక్షులు మాదాల భాస్కరరావు, తిరువీధి ప్రకాష్ రావు, సురేష్
తూర్పు గోదావరి జిల్లా..
కాకినాడ..
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన కాకినాడ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జండా ఆవిష్కరించిన జిల్లా మంత్రులు చెల్లుబోయిన వేణు,విశ్వరూప్.
-జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .
-సభా భవనంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ వంగా గీత ,ఎమ్మెల్సీ పండుల, ఎమ్మెల్యే ద్వారంపూడి ,జిల్లా కలెక్టర్,ఎస్పీ అధికారులు..
విశాఖ..
-వరలక్ష్మి హత్య కేసులో కొత్త ట్విస్ట్
-వరలక్ష్మి ని ప్రేమ పేరుతో వేదించిన అఖిల్ సాయి
-వరలక్ష్మి రాము అనే యువకుడితో చనువుగా ఉండటంతో తట్టుకోలేకపోయిన అఖిల్ సాయి
-సాయిబాబా ఆలయం వద్ద రాము తో కలసి మాట్లాడుతుండగా వరలక్ష్మి పై దాడి చేసిన అఖిల్ సాయి
-దాడి చేసిన వేంటనే పరారైన రాము
-దాడిచేసి వరలక్ష్మి తండ్రికి పోన్ చేసిన అఖిల్ సాయి
-పోలీసుల అదుపులో అఖిల్ సాయి, రాము
-అఖిల్ సాయి రాము పాత్రలపై విచారణ చేస్తున్న పోలీసులు
-ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన వరలక్ష్మి
-ఎయులో లా చేస్తున్న అఖిల్ సాయి
అమరావతి..
- కృష్ణాయపాలెం రైతులకు సంకెళ్లు, రైతుల అరెస్ట్, నిన్న జైల్ భరో సందర్భంగా మహిళలపై పోలీసుల దాడికి నిరసనగా జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుకు
- టీడీపీ మద్దతు తెలపడంతో పాటు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని బంద్ ని విజయవంతం చేయాలి.