Guntur District Updates: ప్రైవేట్ టీచర్ల్స డీఎడ్ అభ్యర్ధుల ఆందోళన..
గుంటూరు జిల్లా..
* కరోనాతో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి టిడిపి నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు.
* ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, డీఎడ్ అభ్యర్ధుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.
* రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది విద్యార్ధిని, విద్యార్ధులకు విద్యాబోధన చేస్తున్న ఐదు లక్షల మంది ఉపాధ్యాయులు జీతాలు లేక రోడ్డున పడ్డారన్నారు.
* చిన్నచిన్న వ్యాపారులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారన్నారు.
* అటువంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు..
Update: 2020-11-01 14:15 GMT