Health: పొరపాటున కూడా పెరుగు ఈ పదార్థాలు కలిపి తినకూడదు..!

Health: వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎన్నో రకాల పదార్థాలు తింటారు.

Update: 2022-05-25 14:45 GMT

Health: పొరపాటున కూడా పెరుగు ఈ పదార్థాలు కలిపి తినకూడదు..!

Health: వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎన్నో రకాల పదార్థాలు తింటారు. అంతేకాదు ఈ సీజన్‌లో పెరుగు వాడకం బాగా పెరుగుతుంది. ప్రజలు దీన్ని చాలా పదార్థాలతో కలిపి తింటారు. వేసవిలో పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే పెరుగుతో కొన్ని పదార్థాలని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. చాలామంది పెరుగు, ఉల్లిపాయలను కలిపి తినడానికి ఇష్టపడతారు. దీనివల్ల ఉదర సమస్యలు ఎదురవుతాయి. ఇది కాకుండా మీరు కొన్ని ఆహారాలని పెరుగుతో కలిపి తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.

మామిడితో పెరుగు తినవద్దు

మామిడికాయ, పాలతో చేసిన మామిడి షేక్ అంటే అందరికి ఇష్టమే. అయితే మీరు మామిడిని పెరుగుతో కలిపి తినకూడదు. పెరుగు, మామిడికాయల కలయిక మీ శరీరానికి హాని కలిగిస్తుంది.

పెరుగును వేడి పదార్థాలతో తినకూడదు

పెరుగు చల్లటి గుణాలని కలిగి ఉంటుంది. మీరు వేడిగా ఉన్న ఏదైనా ఆహారాని పెరుగుని కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల దంతాలు దెబ్బతింటాయి.

పెసరపప్పుతో పెరుగు తినకండి

పెరుగు, పెసరపప్పు కలిపి తినడం శరీరానికి మంచిది కాదు. దీని వల్ల శరీరంలో ఎసిడిటీ, ఉబ్బరం, లూజ్ మోషన్ సమస్యలు తలెత్తుతాయి. లేదంటే ఈ రెండూ తినే సమయంలో కొంత సమయం గ్యాప్ తీసుకోండి.

చేపలు, పెరుగు కలిపి తినకూడదు

పెరుగు, చేపలు కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల శరీరానికి అనేక రకాలుగా హాని జరుగుతుంది. మీరు అజీర్ణం, కడుపు నొప్పి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Tags:    

Similar News