Health Tips: సన్నగా బరువు తక్కువగా ఉన్నారా.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఫుడ్స్ తినండి..!
Health Tips: సన్నగా బరువు తక్కువగా ఉన్నారా.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఫుడ్స్ తినండి..!
Health Tips: శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ఎందుకంటే ప్రొటీన్ నుంచే శరీరం అభివృద్ధి జరుగుతుంది. జుట్టు, చర్మం, కళ్ళు, కండరాలు అన్నింటికీ ప్రోటీన్ అవసరం. అంతేకాదు ప్రోటీన్ కణాలను రిపేర్ చేస్తుంది. కొత్త కణాల ఏర్పాటులో సహాయపడుతుంది. ప్రోటీన్ శరీరాన్ని బలంగా, శక్తివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆహారంలో ప్రొటీన్‌ను చేర్చుకోవాలని సూచిస్తారు. మరోవైపు సన్నగా ఉన్నవారు తప్పనిసరిగా ప్రోటీన్ ఫుడ్స్ తినాలి. ఇటువంటి సమయంలో బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని ఆహారాలని చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.
1. గుడ్లు
గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగాలంటే కోడిగుడ్డులోని పసుపు, తెల్ల భాగం రెండూ తినాలి. ఎందుకంటే తెల్లభాగంలో ప్రొటీన్ ఉంటుంది. అదే సమయంలో పసుపు భాగంలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. అందువల్ల అల్పాహారంలో 2 గుడ్లు తినడం ద్వారా బరువు పెరుగుతారు.
2. ఆల్మండ్
ఆల్మండ్ ఒక డ్రై ఫ్రూట్. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అలాగే బాదం కూడా ప్రోటీన్ మంచి మూలం. కాబట్టి తక్కువ బరువు కలిగి ఉంటే ఆహారంలో బాదంను చేర్చుకోండి.
3. పాలు
పాలలో శరీరానికి కావలసిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు అధిక మొత్తంలో కనిపిస్తాయి. కాబట్టి రోజూ పాలు తాగడం వల్ల బరువు పెరగుతారు. అంతేకాదు ఇది ఉత్తమ ఎంపికని చెప్పవచ్చు.