Health Tips: పుదీనాలో అద్భుత ఔషధగుణాలు.. చలికాలంలో ఈ వ్యాధులకి చక్కటి ఉపశమనం..!

Health Tips: పుదీనాలో అద్భుత ఔషధగుణాలు.. చలికాలంలో ఈ వ్యాధులకి చక్కటి ఉపశమనం..!

Update: 2023-01-20 01:38 GMT

Health Tips: పుదీనాలో అద్భుత ఔషధగుణాలు.. చలికాలంలో ఈ వ్యాధులకి చక్కటి ఉపశమనం..!

Health Tips: పుదీనా ఆకులలో చల్లదనం, తాజాదనాన్ని ఇచ్చే సహజ లక్షణాలు ఉంటాయి. చలికాలంలో వచ్చే సాధారణ ఆరోగ్య, పరిశుభ్రత సమస్యలను తొలగించడంలో ఇవి బాగా పనిచేస్తాయి. పుదీనాని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వినియోగిస్తారు. బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కూడా వాడుతారు. పుదీన ఆకుల మరిన్ని ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

శీతాకాలంలో రకరకాల చర్మ సమస్యలు ఏర్పడుతాయి. వీటిని నివారించడానికి మీరు ప్రతిరోజూ పుదీన టీ తాగవచ్చు. నోటి దుర్వాసనను నివారించడానికి రోజులో ఏ సమయంలోనైనా పుదీనా ఆకులను చిటికెడు నల్ల ఉప్పుతో కలిపి నమలాలి. శ్వాసలో తక్షణ తాజాదనం ఉంటుంది. దగ్గు, జ్వరం నివారించడానికి ప్రతిరోజూ పుదీనా చట్నీని తినవచ్చు.చలికాలంలో మానసిక సమస్యలు ఉన్నవారు పుదీన ఆకులని సలాడ్‌లు, పండ్లు మొదలైన వాటిలో వేసుకొని తీసుకోవచ్చు.

మీరు పుదీనా సువాసన, తాజాదనంతో వింటర్ సీజన్‌లో రోజును ప్రారంభించవచ్చు. మీరు ఒక కప్పు నీటిని వేడి చేసి అందులో 5-6 పుదీనా ఆకులను వేసి 5 నిమిషాలు మంటపై మరిగించి ఆపై ఫిల్టర్ చేసి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చల్లగా ఉన్నప్పుడు కూడా పుదీనా టీని తీసుకోవచ్చు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ అయినందున జలుబు ఫ్లూలో తక్షణ ఉపశమనం ఇస్తుంది.ఏదైనా తప్పుగా తినడం వల్ల కడుపులో సమస్య ఉంటే పుదీనా ఆకుల టీ తాగితే పరిష్కారమవుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.

Tags:    

Similar News