బాత్రూంలో ఉన్నప్పుడు సృజనాత్మక ఆలోచనలు.. కారణం ఇదే..!
Creative Ideas: బాత్రూంలో ఉన్నప్పుడు చాలా మంచి ఆలోచనలు వస్తాయని చాలామంది చెబుతారు.
Creative Ideas: బాత్రూంలో ఉన్నప్పుడు చాలా మంచి ఆలోచనలు వస్తాయని చాలామంది చెబుతారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. చాలా కాలంగా శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. వర్జీనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు. బాత్‌రూమ్‌లో పూర్తిగా భిన్నమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలియజేశారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం.
వాస్తవానికి మంచి ఆలోచనలకి ఏకాగ్రత చాలా ముఖ్యం. కానీ ఒక విషయంపై మెదడును అతిగా ప్రయోగిస్తే తప్పుడు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఏదైనా సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి దాని గురించి ఆలోచించడానికి కొంత సమయం అవసరం. మొదటగా ఇది అందరు గుర్తుంచుకోవాలి. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో బ్రెయిన్ కూడా కూల్‌గా ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి సమస్యపై వేర్వేరు రకాలుగా ఆలోచించగలడు. కాబట్టి పరిష్కారాలు త్వరగా కనుగొంటారు. ఎప్పుడైతే మనిషి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా ఆలోచిస్తాడో అప్పుడు సానుకూల ఫలితాలు వస్తాయి.
వేసవిలో తలపై చల్లటి నీరు, శీతాకాలంలో గోరువెచ్చని నీరు పడినప్పుడు మెదడు మరిన్ని ఆలోచనలను ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు తేల్చారు. కానీ 2015కి సంబంధించి ఒక పరిశోధనలో వేరే విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక వ్యక్తి బలవంతంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తే సృజనాత్మక ఆలోచనలు రావు. మనసు ప్రశాంతంగా లేనప్పుడు వచ్చే ఆలోచనలు అంత ప్రభావవంతంగా ఉండవు.