Liver Diseases: మహిళల్లో లివర్ వ్యాధులు ఎందుకు పెరుగుతున్నాయి.. కారణాలు ఇవే..!
Liver Diseases: ఇటీవల చాలామంది మహిళలు లివర్ వ్యాధుల బారినపడుతున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. జీవనశైలి అలవాట్లు, జన్యుపరమైన కారకాలు లివర్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి.
Liver Diseases: ఇటీవల చాలామంది మహిళలు లివర్ వ్యాధుల బారినపడుతున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. జీవనశైలి అలవాట్లు, జన్యుపరమైన కారకాలు లివర్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. దీనివల్ల లివర్ వాపు, హెపటైటిస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా సంభవిస్తుంది. ఈ వ్యాధి లివర్ ఫెయిల్యూర్‌కు కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గడిచిన రెండు దశాబ్దాల్లో మహిళల్లో లివర్ వ్యాధి కేసులు పెరిగాయి.
హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ లివర్‌లో మంటను కలిగిస్తాయి. మద్యం సేవించే ధోరణి మహిళల్లో పెరిగింది. ఇది లివర్‌ను దెబ్బతీస్తుంది. కొన్ని మందులు లివర్‌కు హాని కలిగిస్తాయి. నోటి గర్భనిరోధకాలు వంటివి లివర్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని సంవత్సరాలుగా మహిళల్లో నోటి గర్భనిరోధకాలు తీసుకునే ధోరణి పెరిగింది. మహిళల్లో లివర్ వ్యాధులు పెరగడానికి ఇది ప్రధాన కారణం. ఇది కాకుండా తప్పుడు ఆహారపు అలవాట్లు, మద్యపానం మహిళల్లో లివర్ వ్యాధిని పెంచడానికి ప్రమాద కారకాణాలుగా ఉంటున్నాయి.
ఎలా రక్షించాలి..?
1. సరైన ఆహారం తీసుకోవాలి.
2. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
3. తగినంత నిద్ర పోవాలి.
4. ఎక్కువ ఫైబర్ ఫుడ్స్ తినాలి.
5. మద్యం సేవించవద్దు.
6. ఫాస్ట్ ఫుడ్ మానుకోవాలి.