Red Meat: రెడ్ మీట్ ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు.. లాభా నష్టాలు తెలుసుకోండి..!

Red Meat: భారతీయ ఆహారంలో నాన్ వెజ్ చాలా ముఖ్యమైన భాగం.

Update: 2023-01-20 14:30 GMT

Red Meat: రెడ్ మీట్ ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు.. లాభా నష్టాలు తెలుసుకోండి..!

Red Meat: భారతీయ ఆహారంలో నాన్ వెజ్ చాలా ముఖ్యమైన భాగం. ముక్క లేనిదే చాలామందికి ముద్ద దిగదు. నాన్‌వెజ్‌లో భాగంగా రెడ్‌ మీట్‌ఎఎక్కువగా తింటారు. రెడ్ మీట్ అనేది క్షీరదాల మాంసం. ఇందులో గొడ్డు మాంసం, పంది మాంసం, గొర్రెలు తదితరాలు వస్తాయి. పూర్తిగా ఎరుపు రంగులో ఉండటం వల్ల దీన్ని రెడ్ మీట్ అంటారు. ఎర్రగా ఉండే మాంసాహారం ఎక్కువ కొవ్వును కలిగి ఉంటుంది. దీని వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే దీనిని తినడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

రెడ్‌ మీట్‌ రోజువారీ ఆహారంలో ఒక భాగం. అయితే దీనిపై తరచుగా పరిశోధనలు జరుగుతుంటాయి. రెడ్ మీట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చాలాసార్లు తేలింది. అయితే రెడ్ మీట్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదాహరణకు, ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ డి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇవన్ని శరీరానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. అయినప్పటికీ కొవ్వు, కొలెస్ట్రాల్ కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది ఊబకాయం, గుండె జబ్బులకి దారితీస్తుంది.

రెడ్‌ మీట్‌ ప్రయోజనాలు

రెడ్‌ మీట్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు తగినంత పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా రోజువారీ అవసరాలను తీర్చుకోవచ్చు. జింక్, విటమిన్ డి, ఒమేగా-3 మంచి మొత్తంలో లభిస్తాయి. క్రియేటిన్, కార్నోసిన్ వంటి ముఖ్యమైన పోషకాలు రెడ్ మీట్‌లో ఉంటాయి. ఇవి కండరాలు, మెదడుకు వివిధ మార్గాల్లో ప్రయోజనం చేకూరుస్తాయి. రెడ్ మీట్‌లో చాలా ప్రొటీన్ ఉంటుంది. దీనిని బాడీబిల్డర్లు, అథ్లెట్లు, ఫిట్‌నెస్ ఫ్రీక్స్ వినియోగిస్తారు. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రెడ్ మీట్ గర్భిణీలలో ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. రెడ్ మీట్ తినడం వల్ల సహజంగా పురుషులలో టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. ఇది లైంగిక జీవితంలో చాలా సహాయపడుతుంది.

Tags:    

Similar News