Children Diet: మీ పిల్లలు హైట్ పెరగడం లేదా.. డైట్‌లో ఈ ఆహారాలు చేర్చండి..!
Children Diet: ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి.
Children Diet: ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. వారు పుట్టినప్పటి నుంచి పెరిగేదాకా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. కొంతమంది పిల్లలు వయసుకు తగ్గట్లుగా హైట్ పెరగరు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ముందుగా పిల్లలకి సరైన పోషకాహారం లభిస్తుందో లేదో గమనించాలి. పోషక విలువలు అందించకపోతే బిడ్డ ఎదుగుదల ఆగిపోతుంది. ఈ రోజుల్లో పిల్లలు ఫాస్ట్, జంక్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతున్నారు కానీ ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. పిల్లలు హైట్ పెరగడానికి కొన్ని ఆహారాలు అందించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. పాలు
పాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. పాలు సంపూర్ణ ఆహారం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఉండే క్యాల్షియం, ప్రొటీన్ పిల్లల ఎముకలు, కండరాల అభివృద్ధికి తోడ్పడతాయి. పిల్లలకు ఉదయం సాయంత్రం పాలు తాగేలా చూసుకోవాలి.
2. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్
కొంతమంది పిల్లలు ఆకు కూరలు తినడానికి ఇష్టపడరు. బదులుగా ఆయిల్, జంక్ ఫుడ్‌ను ఇష్టపడతారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆకుపచ్చ కూరగాయలను తినిపించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులో ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె ఉంటాయి. ఇవి పిల్లల ఎత్తును పెంచడంలో సాయపడుతాయి.
3. పండ్లు
అన్ని వయసుల వారు పండ్లు తినమని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రోజు నుంచే పిల్లలకు పండ్లు తినిపించడం అలవాటు చేయండి.
4. గుడ్డు
గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పిల్లలకు అల్పాహారంలో ఉడికించిన గుడ్లను తప్పక తినిపించాలి. ఇందులో ప్రొటీన్‌తోపాటు, పిండి పదార్థాలు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం పెరుగుదలపై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుంది.