దేశీ మద్యం విదేశీ మద్యానికి తేడాలేంటి..? ఫారెన్‌ మద్యానికి ఎందుకు ఎక్కువ ధర..?

Update: 2021-12-21 03:15 GMT

దేశీ మద్యం విదేశీ మద్యానికి తేడాలేంటి..? ఫారెన్‌ మద్యానికి ఎందుకు ఎక్కువ ధర..?

Alcohol: దేశీ మద్యానికి, విదేశీ మద్యానికి తేడాలేంటి.. ఫారెన్‌ మద్యానికి ఎందుకు ఎక్కువ రేటు ఉంటుంది.. ఎప్పుడైనా ఆలోచించారా..? వాస్తవానికి చెప్పాలంటే ఈ రెండింటికి పెద్ద తేడా ఉండదు. దేశీ మద్యమే ఫారెన్‌ మద్యానికి పునాది. అయితే ఈ విషయం గురించి చెప్పేముందు ఆల్కహాల్‌ అనేది అన్నివిధాలుగా ఆరోగ్యానికి చెడు చేస్తుంది. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే మద్యం తాగే అలవాటు ఉన్నవారు దేశీ మద్యం తాగడానికి ఇష్టపడరు. ఫారెన్‌ మద్యం తాగడానికి ఇష్టపడతారు. కానీ దేశీయ మద్యానికి, ఇంగ్లీష్ మద్యానికి పెద్ద తేడాలేదు. రెండు ఒకే విధంగా తయారుచేస్తారు. ఎలాగో తెలుసుకుందాం.

దేశీయ మద్యం, విదేశీ మద్యం తయారీ ప్రక్రియ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. దేశీయ మద్యం అనేది శుద్ధి చేయబడిన ఒక రకమైన స్పిరిట్ లేదా స్వేదనం. స్వదేశీ వైన్ తయారీదారులు దీనిని ఇంగ్లీష్ బ్రూయింగ్ కంపెనీలకు పంపుతారు. వారు దేశీయ కంపెనీల నుంచి తక్కువ ధరకు ఈ ద్రావణాన్నికొనుగోలు చేస్తారు. తరువాత రకరకాల రుచులు ఆ ద్రావణానికి కలిపి ఫారెన్ మద్యాన్ని తయారు చేస్తారు. దీనికి వారు ఎక్కువ ధరను నిర్ణయిస్తారు. ముడి సరుకు మొత్తం ఒక్కటే కానీ వారు అందులో రుచి కోసం కొన్ని రాకాల సుగంధ ద్రవ్యాలు, ప్లేవర్స్‌ మొదలైనవి కలుపుతారు. దీంతో ఆ మద్యానికి రుచి, స్వభావం వేరుగా ఉంటుంది. అందుకే దీనికి ఎక్కువ ధర ఉంటుంది.

విదేశీ మద్యం ప్యాకింగ్‌ కూడా భినంగా ఉంటుంది.ఆల్కహాల్, స్కాచ్ లేదా ఫ్లేవర్ పెరుగుదలతో దాని ధర పెరుగుతుంది. అదే సమయంలో ఇంగ్లీష్ మద్యంపై ప్రభుత్వం పన్ను కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి దేశీ మద్యం వరిగింజలు, బార్లీ మొదలైన వాటితో తయారుచేస్తారని మద్యం బాటిల్‌పై రాసి ఉంటుంది. దీని రుచి సాదాసీదాగా ఉంటుంది. ఇది కాకుండా ప్రభుత్వం నుంచి పన్ను ప్రయోజనం దొరుకుతుంది. భారతదేశంలో దీని అమ్మకం చాలా ఎక్కువగా ఉంది.

Tags:    

Similar News