Immunotherapy: ఇమ్యునోథెరపీ అంటే ఏమిటి.. దీని ద్వారా క్యాన్సర్‌ను ఎలా నయం చేయవచ్చు..!
Immunotherapy: ఆధునిక కాలంలో క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తుంది. క్యాన్సర్‌కు మందు లేదని అందరికి తెలుసు.
Immunotherapy: ఆధునిక కాలంలో క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తుంది. క్యాన్సర్‌కు మందు లేదని అందరికి తెలుసు. క్యాన్సర్ అనేది శరీరంలోని వివిధ అవయవాలకు సోకుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు క్యాన్సర్ రెండవ అతిపెద్ద కారణం. పెరుగుతున్న లక్షణాల తీవ్రత ఆధారంగా క్యాన్సర్ ను అనేక దశలుగా విభజించారు. క్యాన్సర్ ప్రభావాలను తగ్గించడానికి తొలగించడానికి కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అలాగే కొత్తగా ఇమ్యునోథెరపీ అనేది క్యాన్సర్ కేసులలో ప్రాణాలను కాపాడుతుందని రుజువు చేస్తోంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఇమ్యునోథెరపీ అంటే ఏమిటి?
ఇమ్యునోథెరపీ అనేది ఒక రకమైన క్యాన్సర్ చికిత్స. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి క్యాన్సర్ కణాలను కనుగొని నాశనం చేయడానికి ప్రయోగశాలలో సృష్టించబడిన పదార్థాలను ఉపయోగి స్తుంది. అనేక రకాల ఇమ్యునోథెరపీలు ఉన్నాయి. ఇవి వివిధ మార్గాల్లో పనిచేస్తాయి. కొన్ని ఇమ్యునోథెరపీ చికిత్సలు క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపడానికి లేదా మందగించ డానికి సహాయపడతాయి. మరికొన్ని క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో లేదా శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ఇది ఒంటరిగా లేదా కీమోథెరపీ క్యాన్సర్ చికిత్సలతో కలిపి ఉపయోగించవచ్చు.
ఈ దశ రోగులకు మరింత ప్రయోజనకరం
క్యాన్సర్‌లోని అనేక దశలలో ఇమ్యునోథెరపీ ఉపయోగపడుతుంది. మూత్రపిండాలు, కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో ఫోర్త్ స్టేజ్‌లో ప్రయోగిస్తారు. అయితే ప్రతి క్యాన్సర్ రోగికి ఈ చికిత్స ఇవ్వరు ఎందుకంటే ఇది కొందరికి పనిచేస్తుంది మరికొందరికి పనిచేయదు. ఈ చికిత్సతో చికిత్స పొందిన 25-30% మంది రోగులు దాని నుంచి గరిష్ట ప్రయోజనం పొందుతారు. రోగులకు ఇది ఉత్తమమైన చికిత్స కానీ అధిక ధర కారణంగా సాధారణ ప్రజలు దీనిని ఉపయోగించు కోలేరు. దేశంలో ఇమ్యునోథెరపీ ఖర్చు సెషన్‌కు దాదాపు రూ. 1,50,000- రూ. 4,50,000 వరకు ఉంటుంది. ఇది రోగి పరిస్థితిని బట్టి ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది.