Ectopic Pregnancy: ఎక్టోపిక్ గర్భం అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
Ectopic Pregnancy: ఎక్టోపిక్ గర్భం అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
Ectopic Pregnancy: ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది. అందుకోసం ఎంతకష్టమైన తొమ్మిది నెలలు బిడ్డని మోస్తుంది. ప్రాణాలను పనంగా పెట్టి పిల్లలకి జన్మనిస్తుంది. ఇది ఒక అందమైన అనుభవం. అయితే ఇది ప్రతి మహిళలో సజావుగా జరగదు. గర్భధారణ సమయంలో మహిళల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి సమస్యలలో ఎక్టోపిక్ గర్భం ఒకటి. దీని లక్షణాలు, ప్రమాదాలు, చికిత్స ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి.?
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఫలదీకరణం గర్భాశయంతో జరగదు. అది ఫెలోపియన్ ట్యూబ్ లేదా పొత్తికడుపు కుహరం లేదా గర్భాశయ ముఖద్వారంలో జరుగుతుంది. దీనిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్ ప్రకారం 50 మంది మహిళల్లో ఒకరికి ఇలా జరుగుతుంది. ఎక్టోపిక్ గర్భం లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. కడుపు నొప్పి, వాంతులు, తేలికపాటి లేదా భారీ రక్తస్రావం, కటి నొప్పి, తీవ్రమైన కడుపు తిమ్మిరి, మైకము లేదా బలహీనత, అధిక చెమట, లేత చర్మం, రక్తహీనత, మూర్ఛ, భుజంలో నొప్పి ఉండవచ్చు. మెడ లేదా పాయువు, శరీరం భాగాలలో నొప్పులు ఉంటాయి.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి కారణాలు
ఫెలోపియన్ ట్యూబ్స్ ఇన్‌ఫ్లమేషన్, కొన్ని కారణాల వల్ల ట్యూబ్ దెబ్బతినడం, ఫలదీకరణం అయిన అండం అసాధారణంగా అభివృద్ధి చెందడం, హార్మోన్ అసమతుల్యత, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, 35 సంవత్సరాల తర్వాత గర్భం, పెల్విక్ సర్జరీ వల్ల మచ్చ కణజాలం, సంతానోత్పత్తి మందులు వాడటం, లేదా IVF వల్ల ఇది ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించడం అంత సులభం కాదు. ప్రెగ్నెన్సీ సమయంలో మీకు పదే పదే నొప్పి ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లాలి. వారు చెక్ చేసి నిర్ధారిస్తారు.