Women Health: మహిళలకు అలర్ట్.. PCOD, PCOS మధ్య తేడాలు తెలుసుకోండి..!
Women Health: ఆధునిక కాలంలో జీవన విధానం మారడం వల్ల చాలా మంది మహిళలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Women Health: ఆధునిక కాలంలో జీవన విధానం మారడం వల్ల చాలా మంది మహిళలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి పిసిఒడి, పిసిఒఎస్. ఈ రెండు సమస్యల వల్ల చాలా మంది మహిళలు సంతానాన్ని పొందలేకపోతున్నారు. అంతేకాదు ఈ రెండు సమస్యల మధ్య తేడా తెలియని మహిళలు చాలా మంది ఉన్నారు. ఈరోజు PCOD, PCOSకి సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
PCOD అంటే ఏమిటి?
పిసిఒడిని 'పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్' అని పిలుస్తారు. దీనివల్ల మహిళల్లో అండాశయాలు అండాలను ముందుగానే విడుదల చేస్తాయి. బరువు పెరగడం, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు ఈ సమస్యకి కారణాలు అని చెప్పవచ్చు. PCOD విషయంలో అండాశయాలు వాటి సాధారణ పరిమాణం కంటే పెద్దవిగా మారతాయి. అధిక మొత్తంలో ఈస్ట్రోజెన్‌ను విడుదల చేస్తాయి. ఇది మహిళల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
PCODని ఎలా గుర్తించాలి?
మహిళల్లో పీరియడ్స్ తేదీని గుర్తించలేకపోవడం, ఋతుస్రావం సమయానికి ముందు లేదా సుదీర్ఘ విరామం తర్వాత రావడం, ముఖం, పొట్ట, వీపు వంటి శరీర భాగాలపై వెంట్రుకలు పెరగడం, బరువు పెరగడం లేదా తగ్గడం, చర్మంపై మొటిమలు, ఆయిల్ విపరీతంగా ఏర్పడడం, చిన్న పని చేసినా అలసిపోయినట్లు అనిపించడం దీని లక్షణాలుగా చెప్పవచ్చు.
PCOS అంటే ఏమిటి?
PCOS అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇది PCOD కంటే చాలా తీవ్రమైన ప్రమాదకరమైన రుగ్మత. ఇది అధిక జీవక్రియ, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏర్పడే పరిస్థితి. ఇది గర్భధారణను ప్రభావితం చేస్తుంది. PCOD, PCOS లక్షణాలు చాలావరకు ఒకే విధంగా ఉంటాయి. దీని కారణంగా ప్రజలు వాటి మధ్య తేడాను గుర్తించలేరు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తక్కువ, ఎక్కువ రక్తస్రావం, చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడడం, సంతానలేమి సమస్య రావడం దీని లక్షణాలుగా చెప్పవచ్చు.