Chicken Mutton: చికెన్-మటన్ తినేవారికి హెచ్చరిక.. కొత్త వ్యాధి వచ్చే ప్రమాదం..!
Chicken Mutton: నాన్ వెజ్ తినేవారికి ఓ చేదువార్త వెలుగులోకి వచ్చింది.
Chicken Mutton: నాన్ వెజ్ తినేవారికి ఓ చేదువార్త వెలుగులోకి వచ్చింది. చైనాలో కరోనా తర్వాత ఇప్పుడు సూపర్ బగ్ ప్రమాదం వెంటాడుతోంది. ఇప్పుడు మీరు ఈ సూపర్‌బగ్ ఏంటి అని ఆలోచిస్తూ ఉండాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి పనిచేయడం మానేస్తాయి. ఈ పరిస్థితిలో ఇన్ఫెక్షన్ లేదా ఇతర వ్యాధులని నయం చేయడంలో అవి సహాయం చేయలేవు. ఇలాంటి సమయంలో చిన్న ఇన్ఫెక్షన్ కూడా ప్రాణాంతకంగా మారుతుంది. చికెన్-మటన్ తినేవారిని సూపర్ బగ్ ప్రమాదం వెంటాడుతోంది.
సూపర్ బగ్ అంటే ఏమిటి
నిజానికి సూపర్‌బగ్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా. కొన్ని బ్యాక్టీరియా మనకు మేలు చేస్తే కొన్ని హాని చేస్తాయి. ఇది పరాన్నజీవి జాతిగా చెబుతారు. శరీరంలో దాని సంఖ్య పెరిగినప్పుడు యాంటీబయాటిక్‌పై ప్రభావం పడుతుంది. దీనిని యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ స్థితి అంటారు. నాన్ వెజ్ తినేవారికి సూపర్ బగ్స్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. నేటి రోజుల్లో ఎక్కువ లాభం కోసం కోడి లేదా ఇతర జంతువులకు ఇంజెక్షన్లు ఇస్తున్నారని నిపుణులు అంటున్నారు. వీటి మాంసం తినడం వల్ల యాంటీబయాటిక్స్ మన శరీరంలోకి చేరుతున్నాయి. సూపర్‌బగ్స్ ప్రమాదాన్ని నివారించడానికి నాన్-వెజ్ ఫుడ్‌ను వదులుకోవడం మంచిది.
2018 సంవత్సరంలో ఒక నివేదిక వచ్చింది. అందులో భారతదేశంలో జంతువులు త్వరగా ఎదగడానికి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు ఇస్తున్నారని తేలింది. ఈ నివేదికను లండన్‌కు చెందిన ఎన్‌జీవో బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ప్రచురించింది. ఈ మందులు జంతువుల ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా మానవుల ప్రాణాలకు హాని చేస్తుంది. ఇందులో టైలోసిన్ అనే డ్రగ్ వాడుతున్నట్లు తెలుస్తోంది.
చికెన్, మటన్ వంటి నాన్-వెజ్ ఐటమ్స్ ప్రోటీన్‌కి ఉత్తమ వనరులు. ప్రోటీన్ లోపాన్ని తొలగించడానికి మీరు పన్నీర్, పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులతో భర్తీ చేయవచ్చు. ఇది కాకుండా మీరు పప్పులను తీసుకోవడం వల్ల ప్రోటీన్ పెంచుకోవచ్చు. అంతేగాని చికెన్, మటన్ వంటి నాన్-వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తినకూడదు.