Walnuts Health Benefits: వాల్‌నట్స్ పోషకాల పవర్‌హౌస్.. ఈ వ్యాధులు ఉన్నవారికి దివ్యవౌషధం..!
Walnuts Health Benefits: వాల్‌నట్స్ డ్రైఫ్రూట్స్‌లో రారాజు, పోషకాల పవర్ హౌస్. ప్రతిరోజు పిరికెడు వాల్‌నట్స్ తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
Walnuts Health Benefits: వాల్‌నట్స్ డ్రైఫ్రూట్స్‌లో రారాజు, పోషకాల పవర్ హౌస్. ప్రతిరోజు పిరికెడు వాల్‌నట్స్ తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. చిన్న పిల్లలు, వృద్ధులు తప్పకుండా తీసుకోవాలి. పిల్లల్లో ఇవి మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా వ్యాధులు దూరమవుతాయి. వాల్‌నట్స్ ప్రయోజనాల గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యానికి రక్షకుడు
వాల్‌నట్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్లాంట్ స్టెరాల్స్, ఎల్-అర్జినైన్ వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ మూలకాలు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో, రక్తపోటును తగ్గించడంలో, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
మెదడు శక్తిని పెంచుతుంది
వాల్‌నట్‌లో ఉండే విటమిన్ ఈ, ఫాస్పరస్, యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలకు రక్షణ కల్పిస్తాయి. జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు మెదడు అభివృద్ధి, పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తద్వారా అభ్యాస సామర్థ్యం, ఏకాగ్రత పెరుగుతుంది.
మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది
వాల్‌నట్స్‌లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తాయి. ఇది డయాబెటిక్ రోగులకు మేలు చేస్తాయి. అదనంగా వాల్‌నట్‌లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. శరీరం ఇన్సులిన్‌ను బాగా ఉపయోగించుకునేలా చేస్తుంది.
బరువు కంట్రోల్‌లో ఉంటుంది
వాల్‌నట్స్‌లో కాలరీలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇందులో ఉండే ఫైబర్, ప్రొటీన్‌లు మిమ్మల్ని త్వరగా ఎక్కువ కాలం సంతృప్తిగా ఉంచుతాయి. దీనివల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సమయం ఉంటుంది. ఎక్కవ ఆహారం తినకుండా ఉంటారు. వాల్‌నట్‌లు శరీరంలో జీవక్రియను పెంచుతాయి దీని కారణంగా కేలరీలు వేగంగా కరిగిపోతాయి.
ఎముకలు బలపడుతాయి
కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు వాల్‌నట్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో బోలు ఎముకల వ్యాధిని నయం చేయడంలో సాయం చేస్తాయి. అలాగే వాల్‌నట్‌లో ఉండే రాగి ఎముకలు, కీళ్లకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.