Health Tips: చిన్న దెబ్బలకే ఎముకలు విరిగితే ఈ విటమిన్ లోపించినట్లే.. ఇందుకోసం ఈ ఫుడ్స్ బెస్ట్..!
Health Tips: మానవ శరీరం ఒక యంత్రం లాంటిది. దీనికి రకరకాల పోషకాలు, విటమిన్లు అవసరమవుతాయి.
Health Tips: మానవ శరీరం ఒక యంత్రం లాంటిది. దీనికి రకరకాల పోషకాలు, విటమిన్లు అవసరమవుతాయి. లేదంటే హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవడం వల్ల బాడీ ఫిట్‌గా ఉంచుకోవచ్చు. ఈ రోజుల్లో ఆస్తులు సంపాదించినవాడి కంటే ఆరోగ్యం సంపాదించనవాడే గొప్పవాడు. కొంతమందికి చిన్న చిన్న దెబ్బలు తగిలితేనే ఎముకలు విరుగుతాయి. దీనికి కారణం వారి బాడీలో విటమిన్ బి 12 లోపించిందని అర్థం. ఈ రోజు ఈ విటమిన్ ప్రయోజనాలు, వేటిలో ఇది ఎక్కువగా లభిస్తుందో తెలుసుకుందాం.
ఎముకలు దృఢంగా మారుతాయి
ఎముకలను బలోపేతం చేయడానికి విటమిన్ డి అవసరం. ఇందుకోసం విటమిన్ బి 12 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా బోలు ఎముకల వ్యాధిని తగ్గిస్తుంది.
శరీరానికి శక్తి లభిస్తుంది
రోజంతా పనిచేసి అలసిపోయినట్లు అనిపిస్తే శరీరంలో విటమిన్ బి12 లోపం ఉందని అర్థం. ఈ బలహీనతను అధిగమించడానికి విటమిన్ బి 12 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవలని వైద్యులు చెబుతున్నారు.
డిప్రెషన్ దూరమవుతుంది
మీరు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ B12 అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది నిరాశను దూరం చేస్తుంది.
విటమిన్ బి-12 ఆహారాలు
గుడ్డు, సోయాబీన్, పెరుగు, ఓట్స్, బీట్‌రూట్, పనీర్, బ్రకోలీ, ఫిష్, చికెన్, మష్రూమ్ వీటితో పాటు ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయాలి.