Vitamin B12: విటమిన్‌ బి12 లోపం చాలా ప్రమాదం.. ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

Vitamin B12: నిత్యం మన శరీరానికి చాలా పోషకాలు అవసరమవుతాయి.

Update: 2023-03-08 09:12 GMT

Vitamin B12: విటమిన్‌ బి12 లోపం చాలా ప్రమాదం.. ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

Vitamin B12: నిత్యం మన శరీరానికి చాలా పోషకాలు అవసరమవుతాయి. లేదంటే శరీరంలో బలహీనత మొదలవుతుంది. అంతేకాదు వివిధ రకాల వ్యాధులు సంభవిస్తాయి. మీరు నిరంతరం బలహీనంగా ఉన్నట్లయితే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే దీని వెనుక శరీరంలో విటమిన్ B12 లోపం ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో డైట్‌లో కొన్నిరకాల ఆహారపదార్థాలని చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

గుడ్లు

గుడ్లలో విటమిన్ బి12 ఉంటుంది. మీకు B12 లోపం ఎక్కువగా ఉన్నట్లయితే గుడ్లు కచ్చితంగా తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో గుడ్లు తీసుకుంటే శరీరంలో విటమిన్ B12 లోపం తీరుతుంది.

పాల ఉత్పత్తులు

విటమిన్ B12 ఆవు పాలలో దొరుకుతుంది. ఇది చాలా ప్రయోజనకరమైనది. మీ ఆహారంలో పాలు, పెరుగు మొదలైన వాటిని చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12 లోపం ఉండదు.

సోయా పాలు

శరీరంలో విటమిన్ బి12 లోపం ఉన్నవారు సోయా మిల్క్ తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో విటమిన్ బి12 లోపం తొలగిపోతుంది.

రెడ్ మీట్

రెడ్ మీట్ లో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. కానీ రెడ్ మీట్ అధిక వినియోగం హానికరం. కాబట్టి దీనిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News