Valentines Day 2024: వాలైంటెన్స్‌ డే ఎందుకు జరుపుకుంటారు.. ప్రేమికులకు అసలు ఈ విషయం తెలుసా..?

Valentines Day 2024: లవర్స్‌ ఎంతగానో ఎదురుచూసే ఫిబ్రవరి 14వ తేదీ వచ్చేసింది. ఈ రోజు ఇష్టమైన వారిపై తమ ప్రేమను చాటుకునే రోజు.

Update: 2024-02-14 05:24 GMT

Valentines Day 2024: వాలైంటెన్స్‌ డే ఎందుకు జరుపుకుంటారు.. ప్రేమికులకు అసలు ఈ విషయం తెలుసా..?

Valentines Day 2024: లవర్స్‌ ఎంతగానో ఎదురుచూసే ఫిబ్రవరి 14వ తేదీ వచ్చేసింది. ఈ రోజు ఇష్టమైన వారిపై తమ ప్రేమను చాటుకునే రోజు. ఈ రోజు ఎక్కడ చూసినా ప్రేమజంటలు సందడి చేస్తూ ఉంటాయి. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ దగ్గరైతే రద్దీ మామూలుగా ఉండదు. ఈ రోజున ప్రేమికులు ఒకరి కొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. ఏడాదిలో ఇద్దరి మధ్యన వచ్చిన మనస్పర్థలకు ఈ రోజు పుల్‌స్టాప్‌ పడుతుంది. చాలామంది ఈ రోజు తమకు నచ్చినవారికి ప్రపోజ్‌ చేస్తారు. నిజానికి ఫిబ్రవరి 14న మాత్రమే వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారో చాలామందికి తెలియదు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు ఆ విషయం గురించి చర్చిద్దాం.

వాస్తవానికి వాలెంటైన్స్ డే స్టోరీ రోమ్ కి సంబంధించిన వాలెంటైన్‌ అనే వ్యక్తికి సంబంధించింది. రోమ్‌ను పరిపాలించే క్లాడియస్ అనే రాజు ప్రేమకు వ్యతిరేకి. ప్రేమ వివాహం పురుషుల తెలివితేటలు, బలాన్ని నశింపజేస్తుందని అతడి నమ్మకం. అందుకే తన రాజ్యంలో ప్రేమ పెళ్లిలను నిషేధిస్తాడు. కానీ అతడి సైన్యంలో పనిచేసే వాలెంటైన్ అనే వ్యక్తి రాజును ఎదిరించి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అతడి నిర్ణయం సరైంది కాదని చాలామంది సైనికులకు ప్రేమ పెళ్లిళ్లు జరిపిస్తాడు. దీంతో రోమ్ రాజు అతడికి మరణశిక్ష విధిస్తాడు. వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరితీస్తారు. ఆ రోజు నుంచి వాలెంటైన్స్ ప్రేమకు చిహ్నంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటారు.

నిజానికి 496లో ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని తొలిసారిగా జరుపుకున్నారు. ఐదో శతాబ్దంలో రోమ్‌కు చెందిన పోప్ గెలాసియస్ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకోనున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. ఇది వాలైంటెన్స్‌ డే స్టోరీ. అయితే ఈ స్టోరీని కొంతమంది నమ్ముతారు. మరికొంతమంది నమ్మరు. ఏది ఏమైనప్పటికీ ప్రేమికులందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

Tags:    

Similar News