Skin Care: మృదువైన చర్మం కోసం ఇంట్లో లభించే సహజ పదార్థాలు సూపర్..!

Skin Care: చలికాలం ఊపందుకుంది. ఈ సీజన్‌లో పొడి చర్మం సమస్య ఎక్కువగా ఉంటుంది.

Update: 2022-12-09 15:30 GMT

Skin Care: మృదువైన చర్మం కోసం ఇంట్లో లభించే సహజ పదార్థాలు సూపర్..!

Skin Care: చలికాలం ఊపందుకుంది. ఈ సీజన్‌లో పొడి చర్మం సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సంరక్షణతో పాటు, చర్మానికి కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. అందుకే పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇవి చర్మం మృదువుగా ఉండేందుకు సహాయపడుతాయి. అంతేకాకుండా చర్మ రక్షణ కోసం కొన్ని సహజమైన పదార్థాలని కూడా వాడవచ్చు. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి. వాటి గురించి తెలుసుకుందాం.

కొబ్బరి నూనె

చర్మ సంరక్షణలో కొబ్బరి నూనె అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది పొడి చర్మాన్ని నివారించడంలో సహాయపడుతుంది. డ్రై స్కిన్ వదిలించుకోవడానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా ఉంచడంలో పనిచేస్తుంది.

కలబంద

కలబందను అనేక రకాల సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. చర్మానికి కలబందను ఉపయోగించవచ్చు. ఇది మొటిమలు, ముడతలు వంటి చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

తేనె

తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతాయి.

పెరుగు

పెరుగు సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో చర్మానికి పెరుగును ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇది పొడి, నిర్జీవ చర్మాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

పాలు

మీరు చర్మానికి పచ్చి పాలను ఉపయోగించవచ్చు. ఇది టోనర్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, లాక్టిక్ యాసిడ్ ఉంటాయి. ఇది ముఖంపై మచ్చలను తొలగించడానికి పనిచేస్తుంది.

Tags:    

Similar News