Women Health: మహిళలు ఏ వయసు వరకు పిల్లల్ని కనగలరో తెలుసా..!
Women Health: పురుషులతో పోలిస్తే మహిళలు చాలా బలహీనంగా ఉంటారు.
Women Health: పురుషులతో పోలిస్తే మహిళలు చాలా బలహీనంగా ఉంటారు. దీనికి కారణం వారి శరీర తత్వమే. ఒకప్పుడు మహిళలని కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగా చూసేవారు కానీ నేడు కాలం మారింది. మహిళలు కూడా పురుషులతో సమానంగా చదువుతున్నారు.. ఉద్యోగాలు చేస్తున్నారు.. వేతనాలు అందుకుంటున్నారు. కానీ రోజు రోజుకి పిల్లల్ని కనే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. దీనికి కారణం జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవడం, పిల్లల కోసం ప్లాన్ చేయడం. వాస్తవానికి మహిళలు ఏ వయసు వరకు పిల్లల్ని కనే శక్తిని కలిగి ఉంటారో తెలుసుకుందాం.
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏటా 15- 19 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిల్లో సుమారు కోటి 20 లక్షల మంది గర్భం దాలుస్తున్నారు. అయితే వారిలో చాలా మంది ప్రసూతి మరణాల బారిన పడుతున్నారు. ఈ వయసు పిల్లల్ని కనేందుకు సరైన వయసు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అలాగే 32 ఏళ్ల తర్వాత మహిళలు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. ఆలస్యంగా పిల్లల్ని కనడం వల్ల పుట్టే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్, నెలలు నిండక ముందే పిల్లలు పుట్టడం, జెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ ఎక్లాంప్సియా వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది.
వాస్తవానికి మహిళలలో 20 నుంచి 30 ఏళ్ల కాలం పిల్లల్ని కనేందుకు ఉత్తమ సమయం. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నిజానికి నెలసరి వస్తున్నంత కాలం స్త్రీలు గర్భం దాల్చడానికి అర్హులే. మెనోపాజ్ వచ్చాక నెలసరి ఆగిపోతుంది. ఆ తరువాత వారు సహజ పద్ధతిలో గర్భం దాల్చలేరని అర్థం. కానీ 30 ఏళ్ల లోపు రెండు ప్రసవాలు పూర్తి కావాలని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.