Diabetes: టైప్ 2 డయాబెటిస్ బాధితులు ఈ వ్యాధుల బారిన పడే అవకాశం..!

Diabetes: టైప్ 2 డయాబెటిస్ బాధితులు ఈ వ్యాధుల బారిన పడే అవకాశం..!

Update: 2022-03-29 16:30 GMT

Diabetes: టైప్ 2 డయాబెటిస్ బాధితులు ఈ వ్యాధుల బారిన పడే అవకాశం..!

Diabetes: టైప్ 2 డయాబెటిస్ బాధితులు క్యాన్సర్, కిడ్నీ, నరాల వంటి 57 తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయం ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. ఇది ఊబకాయానికి సంబంధించినది. జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మధ్య వయస్కుల వారిపై పరిశోధనలు జరిగాయి.

ఇందులో టైప్‌-2 డయాబెటీస్‌తో బాధపడుతున్న వ్యక్తులు అదేవిధంగా డయాబెటీస్‌ లేని వ్యక్తులపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనలో టైప్‌ 2 డయాబెటీస్‌ వ్యక్తులకి దీర్ఘకాలం పాటు ఇబ్బంది పెట్టే 57 రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు గుర్తించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పరిశోధన ఫలితాలు చాలా ఆశ్చర్యకరమైనవి. టైప్-2 డయాబెటీస్‌ లేని వారు ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి రాకుండా నిరోధించాలి. ఈ అధ్యయనం డయాబెటిస్ UK ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు.

UK బయోబ్యాంక్, GP రికార్డుల నుంచి సుమారు 3 మిలియన్ల మంది నుంచి డేటా సేకరించారు. ముఖ్యంగా మధ్య వయస్కులకు వచ్చే 116 వ్యాధులపై అధ్యయనం చేశారు. టైప్-2 డయాబెటీస్‌ ఉన్నవారికి 57 ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అందులో క్యాన్సర్ ముప్పు 9 శాతం ఎక్కువగా ఉందని తేలింది. టైప్ 2 మధుమేహం ఉన్న రోగులకు చివరి దశలో మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం 5.2 రెట్లు ఎక్కువ. ఇది కాకుండా కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 4.4 రెట్లు ఎక్కువ. కండరాల క్షీణత 3.2 రెట్లు ఎక్కువగా ఉంది.

Tags:    

Similar News