Toothpaste: టూత్‌పేస్ట్ దంతాలకి మాత్రమే కాదు.. వీటిని కూడా మెరిసేలా చేస్తుంది..!
Toothpaste: టూత్‌పేస్ట్ దంతాలకి మాత్రమే కాదు.. వీటిని కూడా మెరిసేలా చేస్తుంది..!
Toothpaste: టూత్‌పేస్టులో క్లీనింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది దంతాలను తెల్లగా మార్చడమే కాకుండా కఠినమైన మరకలను సులభంగా తొలగిస్తుంది. ఫోన్ కవర్‌పై మరకలను తొలగించడం కష్టం. టూత్‌పేస్ట్ ఫోన్ కవర్‌ను శుభ్రం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొంచెం పేస్టుని కవర్‌పై వేసి 2-3 నిమిషాలు ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల కవర్ మీద ఉన్న పసుపు మరకలు తొలగిపోతాయి. టూత్‌పేస్ట్‌తో ఇంట్లోని ఏ వస్తువులు శుభ్రం చేయవచ్చో తెలుసుకుందాం.
లిప్స్టిక్ మరకలు
దుస్తులపై లిప్‌స్టిక్ మరకలు పడితే వాటిని తొలగించడం చాలా కష్టం. మనం వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తే అది ఇంకా ఎక్కువవుతుంది. మరక ఉన్న ప్రదేశంలో టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి కాసేపు అలాగే ఉంచి ఆ తర్వాత బ్రష్‌తో రుద్ది శుభ్రం చేస్తే లిప్‌స్టిక్ మరక తొలగిపోతుంది.
టీ గుర్తులు
చాలా సార్లు టేబుల్‌పై టీ గ్లాస్ గుర్తులు ఉంటాయి. ఎక్కువసేపు శుభ్రం చేయకపోతే మరకను తొలగించడం కష్టం. టూత్‌పేస్ట్‌తో శుభ్రం చేస్తే టేబుల్‌పై టీ మరకలు సులభంగా తొలగిపోతాయి.
నగల నలుపు
వెండి ఆభరణాలు పాతబడితే నల్లగా కనిపిస్తాయి. వాటిని టూత్‌పేస్ట్‌తో శుభ్రం చేయవచ్చు.ఈ ట్రిక్ మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టూత్‌పేస్ట్ అప్లై చేయడం ద్వారా నగల మెరుపును తిరిగి పొందవచ్చు. నగలపై టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి 20 నిమిషాల పాటు బ్రష్‌తో శుభ్రం చేస్తే నలుపు మొత్తం పోతుంది.