Diabetes: షుగర్‌ పేషెంట్లు పాలని ఈ 3 రూపాల్లో తీసుకుంటే సూపర్..

Diabetes: షుగర్‌ పేషెంట్లు పాలని ఈ 3 రూపాల్లో తీసుకుంటే సూపర్..

Update: 2022-03-11 15:30 GMT

Diabetes: షుగర్‌ పేషెంట్లు పాలని ఈ 3 రూపాల్లో తీసుకుంటే సూపర్..

Diabetes: భారతదేశంలో మధుమేహ వ్యాధి సర్వసాధారణమైపోయింది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్‌లో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలి. ఈ పరిస్థితిలో పాల వినియోగం ఈ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే డయాబెటిక్ పేషెంట్లు ఏ సమయంలో పాలు తీసుకోవాలి అనే ప్రశ్న చాలామందికి తలెత్తుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ రోగులు అల్పాహారంలో పాలు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను తగ్గిస్తుంది. పెరిగిన రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

1. పసుపు పాలు

పసుపు పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని రుజువు అయింది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్ రోగులకు చాలా మంచివిగా పరిగణిస్తారు. వీటిని తాగడం వల్ల ఇన్సులిన్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది.

2. దాల్చిన చెక్క పాలు

దాల్చిన చెక్క పాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిదని అనేక పరిశోధనలలో వెల్లడైంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగర్‌ని నియంత్రించడంలో సూపర్‌గా పని చేస్తాయి.

3. బాదం పాలు

బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ డి, విటమిన్ ఈ అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News