Diabetes Symptoms: డయాబెటీస్‌ రాకముందే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. ముందుగానే గుర్తించి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం..!

Diabetes Symptoms: భారతదేశంలో రోజు రోజుకి మధుమేహ బాధితులు పెరుగుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

Update: 2023-11-05 01:30 GMT

Diabetes Symptoms: డయాబెటీస్‌ రాకముందే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. ముందుగానే గుర్తించి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం..!

Diabetes Symptoms: భారతదేశంలో రోజు రోజుకి మధుమేహ బాధితులు పెరుగుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి శారీరక శ్రమ లేకపోవడం, ఆహారం ఎక్కువగా తీసుకోవడం, మద్యం తాగడం, జంక్ ఫుడ్ తినడం మొదలైనవి ఉన్నాయి. ఇది రాకుండా ఉండాలంటే ముందుగా జీవనశైలిని మార్చుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. వ్యాయామం, యోగా వంటివి జీవితంలో భాగంగా చేసుకోవాలి. అయితే మధుమేహాన్ని ఎలా నివారించాలి దాని ప్రారంభ లక్షణాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ప్రీ-డయాబెటిస్ లక్షణాలు?

ప్రీ-డయాబెటిస్ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. ఇది ఏ రోగిలోనైనా చాలా ఆలస్యంగా బయటపడుతాయి. కానీ వారు దాని గురించి తెలుసుకునే సమయానికి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ప్రీ-డయాబెటిస్ లక్షణాల గురించి చెప్పాలంటే పెరిగిన లేదా తగ్గిన ఆకలి, అలసట, అధిక దాహం మొదలైనవి ఉంటాయి.

హార్మోన్లపై ప్రభావం

మగ, ఆడ అనే తేడా లేకుండా మధుమేహం హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. పురుషుల్లో మధుమేహం ఉన్నప్పుడు టెస్టోస్టెరాన్ స్థాయి పడిపోతుంది. మహిళల్లో కూడా హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి.

రోగులు ఏ పండ్లు తినాలి?

డయాబెటిక్ పేషెంట్లు అన్ని పండ్లు తినవచ్చు. అయితే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఆరెంజ్, కివీ, సీజనల్ ఫ్రూట్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.

ఏ విషయాలను నివారించాలి?

డయాబెటిక్ పేషెంట్లు మద్యం తాగకూడదు. వేయించిన ఆహారం, అన్నం, బంగాళదుంపలు ఎక్కువగా తినకూడదు. మామిడి, పైనాపిల్, సపోటా వంటి తీపి పండ్లను ఎక్కువగా తినకూడదు. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయాలి.

Tags:    

Similar News