Health Tips: షుగర్ పేషెంట్లకి అలర్ట్.. చక్కెర స్థాయిల అదుపుకి ఈ మసాల దినుసులు వాడాల్సిందే..!
Health Tips: దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
Health Tips: దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మందులు లేకుండా ఈ వ్యాధిని నియంత్రించడం చాలా కష్టం. ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. చక్కెర స్థాయిని నియంత్రించాలంటే వంటగదిలో ఉన్నకొన్ని మసాల దినుసులని ఉపయోగించవచ్చు. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుని రోజూ తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది.
మెంతులు
డయాబెటిస్‌లో మెంతులు చాలా మేలు చేస్తాయి. మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. మెంతి గింజలు తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. పౌడర్ తయారు చేసి ఖాళీ కడుపుతో తింటే మధుమేహ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది.
నల్ల మిరియాలు
నల్ల మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఆహారం తినడానికి ఒక గంట ముందు మిరియాల పొడిని తీసుకోవాలి. షుగర్ అదుపులో ఉంటుంది.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. డయాబెటిస్‌లో దాల్చినచెక్క ప్రయోజనకరంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. పసుపు, మెంతి గింజలతో దాల్చిన చెక్కను కలిపి పొడిని తయారు చేసుకోవచ్చు. ఈ పొడిని గోరువెచ్చని నీటితో ఖాళీ కడుపుతో తీసుకోవాలి. డయాబెటిస్‌లో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఆహారం ఇలా ఉండాలి
మధుమేహాన్ని నియంత్రించడానికి ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆహారం తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అందుకే అధిక కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తినకూడదు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్, ప్రోటీన్, యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న వాటిని తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.