Potassium Deficiency: శరీరంలో పొటాషియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా.?

Potassium Deficiency: అన్ని రకాల విటమిన్లు, మినరల్స్‌ లభిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటామనే విషయం తెలిసిందే.

Update: 2024-09-27 07:12 GMT

Potassium Deficiency: శరీరంలో పొటాషియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా.?

Potassium Deficiency: అన్ని రకాల విటమిన్లు, మినరల్స్‌ లభిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటామనే విషయం తెలిసిందే. ఏ ఒక్కదాంట్లో తేడా వచ్చినా వెంటనే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇలా శరీరానికి కావాల్సిన ముఖ్యమైన వాటిలో పొటాషియం ఒకటి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ శరీరంలో పొటాషియం లోపిస్తే తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో నీటిని, రక్తపోటును నియంత్రించడంలో పొటాషియంది కీలక పాత్ర. నరాల పనితీరుపై పొటాషియం కీలక ప్రభావం చూపిస్తుంది. శరీరంలో పొటాషియం తగ్గడానికి ప్రధాన కారణాల్లో యాంటీ బయోటిక్ మందులు ఎక్కువగా వాడడం. చెమట ఎక్కువగా రావడం, ఫోలిక్‌ యాసిడ్‌ తగ్గడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. శరీరంలో పొటాషియం తగ్గితే నీరసం, అలసట, మానసిక ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలంగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

ఇక కాళ్లు, చేతులు, భుజాల్లో తిమ్మిరపడుతున్నట్లు అనిపించినా పొటాషియం లోపంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. తరచూ మూత్రం రావడం కూడా శరీరంలో పొటాషియం తగ్గిందనేందుకు ప్రధాన సంకేతంగా చెప్పుకోవచ్చు. తరచూ యూరిన్‌ వస్తున్న భావన కలిగినా అది పొటాషియం లోపానికి సంకేతంగా భావించాలని నిపుణులు అంటున్నారు. ఇక పొటాషియం లోపం కారణంగా జీర్ణక్రియ సైతం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. కండరాల నొప్పి, కండరాల సంకోచం, మూడ్‌ స్వింగ్స్‌, చిరాకు, విసుగు వంటివి కూడా పొటాషియం లోపానికి సంకేతాలుగా చెబుతుంటారు.

పొటాషియం లోపం నుంచి బయటపడాలంటే తీసుకునే ఆహారంలో కొన్నింటిని భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైవని పాలకూర, అవకాడో, కొబ్బరి నీళ్లు, అరటి పండ్లు, ఆనపకాయ విత్తనాలు. ఇలాంటి వాటిని రెగ్యులర్‌గా డైట్‌లో భాగం చేసుకుంటే పొటాషియం లోపం నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News