Brinjal Side Effects: ఈ వ్యక్తులు పొరపాటున కూడా వంకాయ కూర తినవద్దు.. ఎందుకంటే..?
Brinjal Side Effects: కొంతమంది కొన్ని కూరలని ఎంతో ఇష్టంతో తింటారు. కానీ తర్వాత చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటారు.
Brinjal Side Effects: కొంతమంది కొన్ని కూరలని ఎంతో ఇష్టంతో తింటారు. కానీ తర్వాత చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వంకాయ గురించి. కూరగాయలు, రుచిలో రారాజు వంకాయ. కానీ దీనిని తీసుకున్న తర్వాత కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే వంకాయ తినడం మానుకోవాల్సిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారి గురించి ఈరోజు తెలుసుకుందాం.
పైల్స్ వ్యాధి
పైల్స్‌తో బాధపడేవారు వంకాయలకు దూరంగా ఉండాలి. దీనిని తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. అందుకే దూరంగా ఉంటే మంచిది.
కడుపు సమస్యలు
తరచుగా కడుపు సమస్యలు ఉన్నవారు వంకాయ తినడం మానుకోవాలి. దీనివల్ల గ్యాస్-ఎసిడిటీ మరింత పెరుగుతుంది. అందుకే డైట్ నుంచి తొలగించండి.
రక్తహీనత
రక్తహీనత ఉన్నవారు పొరపాటున కూడా వంకాయ తినవద్దు. దీనివల్ల శరీరంలో రక్తం తయారీకి ఆటంకాలు ఏర్పడుతాయి. ఈ కారణంగా శరీరం మరింత బలహీనంగా మారుతుంది.
స్కిన్ అలెర్జీలు
స్కిన్ అలర్జీతో బాధపడేవారు వంకాయ తినకుండా ఉండాలి. లేదంటే అలెర్జీ మరింత పెరుగుతుంది. వ్యాధి తీవ్రత మరింత ముదురుతుంది.
రాళ్ల సమస్యలు
కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారు వంకాయ తినవద్దు. ఇందులో ఉండే ఆక్సలేట్ రాళ్ల సమస్యను మరింత పెంచుతుంది.