Asafoetida: ఈ వ్యక్తులు ఇంగువ వాడకూడదు.. సమస్య మరింత పెద్దదవుతుంది..!
Asafoetida: భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరి వంటింట్లో అనేక మసాలాలు ఉంటాయి. ఎందుకంటే మసాలాలకు పుట్టిళ్లు భారతదేశం.
Asafoetida: భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరి వంటింట్లో అనేక మసాలాలు ఉంటాయి. ఎందుకంటే మసాలాలకు పుట్టిళ్లు భారతదేశం. ప్రాచీన కాలం నుంచి భారతీయులు వంటలలో అనేక మసాలాలను ఉపయోగిస్తున్నారు. ఇవి ఆహారానికి ప్రత్యేక రుచిని అందిస్తాయి. ఇలాంటి మసాలా పదార్థాలలో ఇంగువ ఒకటి. దీనిని ఎక్కువగా సాంబార్‌లో వాడుతారు. దీనివల్ల సాంబర్ రుచి అదిరిపోతుంది. ఇంగువలో విటమిన్లు, కాల్షియం, ఐరన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా మేలు చేస్తాయి. పరిమిత పరిమాణంలో ఇంగువ తీసుకుంటే పర్వాలేదు కానీ అతిగా తీసుకోకూడదు. చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇక కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇంగువకు దూరంగా ఉండాలి. వారి గురించి తెలుసుకుందాం.
బీపీ పేషెంట్లు పరిమిత పరిమాణానికి మించి ఇంగువ తీసుకోకూడదు. దీనివల్ల బీపీ లెవల్లో వేగంగా మార్పులు వస్తాయి. ఇంగువ ఎక్కువగా తీసుకోవడం వల్ల తలనొప్పి వస్తుంది. ఇది కాకుండా మైకం కూడా ఎదురవుతుంది. కాబట్టి ఇంగువను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. కడుపు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి ఇంగువను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ఇంగువను అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.
గర్భిణీలు ఇంగువ తీసుకోవడం మానుకోవాలి. ఇది గర్భాశయం సంకోచాన్ని ప్రేరేపిస్తుంది. గర్భస్రావానికి కారణమవుతుంది. ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంగువను ఎక్కువగా తీసుకోవడం వల్ల దద్దుర్లు వస్తాయి. ఇది చర్మంపై ఎర్రటి మచ్చలను కలిగిస్తుంది. మీకు ఏదైనా చర్మ సంబంధిత వ్యాధులు ఉంటే ఇంగువ వాడకాన్ని నివారించాలి.ఇంగువను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వాపులు వస్తాయి. ఇవి పెదవులు, మెడ, ముఖంపై వాపులకు కారణమవుతుంది. ఈ సమస్యలను నివారించడానికి ఇంగువ తీసుకోవడం మానేయాలి.