Health Tips:కొలస్ట్రాల్‌ తగ్గించాలంటే కచ్చితంగా ఈ పండ్లు తినాల్సిందే..!

Health Tips:కొలస్ట్రాల్‌ తగ్గించాలంటే కచ్చితంగా ఈ పండ్లు తినాల్సిందే..!

Update: 2023-01-13 13:30 GMT

Health Tips:కొలస్ట్రాల్‌ తగ్గించాలంటే కచ్చితంగా ఈ పండ్లు తినాల్సిందే..!

Health Tips:చలికాలంలో వాతావరణం, జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతోంది. ఈ సీజన్‌లో నూనె, నెయ్యితో చేసిన ఆహారాలు ఎక్కువగా తింటారు. ఇలాంటి కొవ్వు పదార్థాలు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తర్వాత ఇది రక్త నాళాలలో చేరి రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల చాలాసార్లు రక్తం గుండెకు సరిగా చేరదు. ఇది గుండెకు సంబంధించిన అనేక సమస్యలకు కారణం అవుతుంది. అధిక కొలెస్ట్రాల్ తొలగించడానికి ఆహారంలో పండ్లను చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

ఆపిల్:

యాపిల్‌లో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది శరీరంలో జీవక్రియను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. యాపిల్ కొవ్వును చాలా వరకు తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని దూరం చేస్తుంది.

బొప్పాయి:

బొప్పాయి గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

ఆరెంజ్, నారింజ:

నారింజ, దానిమ్మ వంటి పండ్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని దూరం చేస్తాయి.

పియర్:

కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో పియర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బేరిపండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.

ద్రాక్ష:

పోషకాలు అధికంగా ఉండే ద్రాక్షను ఆహారంలో చేసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ద్రాక్షలో ఉండే ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

Tags:    

Similar News