Health Tips: ఈ పండ్లు, కూరగాయలు విటమిన్ సి రిచ్ ఫుడ్స్.. శీతాకాలంలో తప్పనిసరి..!

Health Tips: ఈ పండ్లు, కూరగాయలు విటమిన్ సి రిచ్ ఫుడ్స్.. శీతాకాలంలో తప్పనిసరి..!

Update: 2022-11-04 14:24 GMT

Health Tips: ఈ పండ్లు, కూరగాయలు విటమిన్ సి రిచ్ ఫుడ్స్.. శీతాకాలంలో తప్పనిసరి..!

Health Tips: శీతాకాలంలో అంటువ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సీజన్‌ మారినప్పుడు రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనపడుతుంది. అందుకే చలికాలం ప్రారంభంకాగానే జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి వ్యాధుల బారిన పడుతారు. కరోనా కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సీజన్‌లో కచ్చితమైన డైట్‌ పాటించాలి. ముఖ్యంగా విటమిన్‌ సి అధికంగా ఉండే ఆహారాలు, పండ్లని తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

ఆరెంజ్ : ఈ పండు విటమిన్ సి ఉత్తమ వనరులలో ఒకటి. 100 గ్రాముల నారింజలో 53.2 విటమిన్ సి ఉంటుంది. ఇది కణాలకు నష్టం జరగకుండా చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. కొల్లాజెన్‌ను పెంచుతుంది. ముఖ్యంగా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

బ్రోకలీ: ఇది ఫైబర్, పొటాషియం, ప్రోటీన్లతో లోడ్ చేయబడి ఉంటుంది. 100 గ్రాముల బ్రోకలీలో 89.2 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అరకప్పు ఉడికించిన బ్రోకలీ నుంచి శరీరానికి 57 శాతం విటమిన్ సి అందుతుంది.

క్యాప్సికమ్ : క్యాప్సికమ్ పోషకాల నిధి. ఇందులో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఇందులో రోజువారీ అవసరాల్లో 169 శాతం తీరుతుంది.

స్ట్రాబెర్రీలు: మెగ్నీషియం, ఫాస్పరస్ గొప్ప మూలంతోపాటు విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహం, పక్షవాతం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక కప్పు స్ట్రాబెర్రీలో 90 mg విటమిన్ సి ఉంటుంది.

టొమాటో: టొమాటో పోషకాల నిధి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు బి, ఈ, పొటాషియం, అనేక ఇతర పోషకాలు ఉంటాయి. టమోటాని ప్రతి కూరలో వినియోగిస్తారు. అయితే మీరు దీన్ని పచ్చిగా కూడా తినవచ్చు.

Tags:    

Similar News