Curd: మరిచిపోయి కూడా పెరుగుతో వీటిని తినొద్దు..!

Curd: మరిచిపోయి కూడా పెరుగుతో వీటిని తినొద్దు..!

Update: 2022-06-30 12:30 GMT

Curd: మరిచిపోయి కూడా పెరుగుతో వీటిని తినొద్దు..!

Curd: పెరుగు ఒక సంపూర్ణ ఆహారం. పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో పోషకాలు పుష్కలం. ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, బి-12, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. పెరుగును రోజూ తీసుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంటుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి పెరుగును రోజూ తీసుకోవడం మంచిది. అయితే పెరుగును మరిచిపోయి కూడా కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తినకూడదు. వాటి గురించి తెలుసుకుందాం.

1. పప్పులు

పెరుగు మీ కడుపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ మీరు పెరుగును పప్పుతో తీసుకుంటే అది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఈ ఫుడ్ కాంబినేషన్ కు దూరంగా ఉండాలి.

2. మామిడి

వేసవిలో ప్రజలు చల్లగా ఉండటానికి చాలా షేక్స్, పళ్లరసాలని తీసుకుంటారు. అయితే కొన్ని జ్యూస్‌ల తయారీలో పండ్లు, డ్రై ఫ్రూట్స్, గింజలు, పెరుగు, పాలు కూడా కలుపుతారు. కానీ చాలా మంది మామిడికాయ జ్యూస్‌లో పెరుగును కలుపుతారు. ఇలా చేయడం మంచిది కాదు. దీనివల్ల చర్మంపై మొటిమలు, అలర్జీ సమస్యలు వస్తాయి.

3. పాలు

పెరుగుతో పాలు తీసుకోవడం మంచిదికాదు. ఇలా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్త్తే అవకాశం ఉంది.

4. ఉల్లిపాయ

చాలామంది ఉల్లిపాయతో పెరుగును తీసుకుంటారు. కానీ అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పెరుగును ఉల్లిపాయతో కలిపి తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు, అలర్జీలు, సోరియాసిస్ వంటి సమస్యలు ఏర్పడుతాయి.

Tags:    

Similar News