Diabetic Patients: షుగర్ పేషెంట్లకి ఈ ఆహారాలు బెస్ట్.. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తాయి..!
Diabetic Patients: భారతదేశంలో రోజు రోజుకి డయాబెటీస్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. ఇది జీవనశైలికి సంబంధించిన సమస్య.
Diabetic Patients: భారతదేశంలో రోజు రోజుకి డయాబెటీస్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. ఇది జీవనశైలికి సంబంధించిన సమస్య. ప్రతి ఇంట్లో దాదాపు ఒక డయాబెటీస్ రోగి ఉంటున్నాడు. ఈ వ్యాధి సంభవించినప్పుడు ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల మందులు వాడాల్సి వస్తుంది. అవసరమైతే ఇన్సులిన్ ఇంజక్షన్ వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి అధిక ఫైబర్ ఉన్న ఆహారాన్ని తినాలి. అలాంటి ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
మెంతి గింజలు
మెంతి గింజలలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇందులో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే సమ్మేళనాలు ఉంటాయి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
బచ్చలికూర
బచ్చలికూర అనేది పీచు ఇంకా ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉండే ఒక ఆకు కూర. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఫైబర్-రిచ్ ఎంపిక కోసం ఈ ఆకుకూరని డైట్‌లో కచ్చితంగా చేర్చుకోవాలి.
చియా విత్తనాలు
చియా విత్తనాలలో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు ఇవి ఒక జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. పోషకమైన ఫైబర్-రిచ్ అల్పాహారాన్ని చియా గింజలతో తయారుచేయవచ్చు.
జామ
జామలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇది కరిగే ఫైబర్. తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్పైక్‌లను నివారించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంలో జామను చిరుతిండిగా తీసుకోవాలి.
బ్రోకలీ
బ్రోకలీ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ లోడ్ కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.