Health Tips: వేగంగా బరువు తగ్గడానికి డైట్‌లో ఈ మార్పులు.. పది రోజుల్లో ప్రభావం చూస్తారు..!

Health Tips: నేటిరోజుల్లో చాలామంది జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు.

Update: 2023-02-14 11:55 GMT

Health Tips: వేగంగా బరువు తగ్గడానికి డైట్‌లో ఈ మార్పులు.. పది రోజుల్లో ప్రభావం చూస్తారు..!

Health Tips: నేటిరోజుల్లో చాలామంది జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు. దీంతో పెరిగిన బరువు తగ్గించుకోవాడానికి గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నారు. అయితే వ్యాయామం, డైట్ లేకుండా కూడా సులువుగా బరువు తగ్గవచ్చు. ఈ చిట్కాలని పాటించడం వల్ల కేవలం 10 రోజుల్లో ప్రభావం చూస్తారు. వాటి గురించి తెలుసుకుందాం.

ఆహారపు అలవాట్లలో మార్పులు

బరువు పెరిగిన తర్వాత తగ్గించుకోవడం అనేది చాలా సవాలుతో కూడాని పని. దీని కోసం ప్రజలు గంటల తరబడి వర్కవుట్‌లు చేయాలి. కానీ ఊబకాయంతో బాధపడేవారు ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా మాత్రమే బరువు తగ్గుతారని గుర్తుంచుకోండి.

లంచ్,డిన్నర్ మధ్య తేలికపాటి స్నాక్స్

లంచ్, డిన్నర్ మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి అతిగా తినకుండా ఉండాలంటే మధ్యలో స్నాక్స్ తీసుకోవాలి. ఎందుకంటే లంచ్, డిన్నర్ మధ్య ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ప్రజలు ఎక్కువ ఆకలితో ఉంటారు. దీంతో రాత్రి ఎక్కువ ఆహారం తీసుకుంటారు. దీంతో బరువు అధికంగా పెరుగుతారు. అందుకే లంచ్, డిన్నర్ మధ్య తేలికపాటి స్నాక్స్ తీసుకోవడం మంచిది.

చిన్న ప్లేట్‌లోనే ఆహారం

బరువు తగ్గడానికి ఆహారం తక్కువగా తీసుకోవడం అవసరం. దీని కోసం చిన్న ప్లేట్లో ఆహారం తినాలి. ఇది మైండ్ కంట్రోల్ ఫార్ములా. ఒక చిన్న ప్లేట్‌లో తినడం వల్ల మనస్సు చాలా ఆహారం తిన్నట్లుగా ఫీలవుతుంది. అయినప్పటికీ ప్రారంభ రోజుల్లో ఆకలిగా ఉంటుంది. కానీ క్రమంగా ఈ సమస్య తగ్గుతుంది.

నిద్రపోవడానికి 2 గంటల ముందు రాత్రి భోజనం

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే నిద్రవేళకు కనీసం 2 గంటల ముందు రాత్రి భోజనం చేయాలి. రాత్రి భోజనం తర్వాత ఇంకేమీ తినకూడదని గుర్తుంచుకోండి. 10 గంటలకు నిద్రపోతే 8 గంటలకు ముందు రాత్రి భోజనం చేయాలి. ఆ తర్వాత ఏమీ తినకూడదు.

భోజనానికి ముందు వేడి పానీయాలు

ఆహారం తీసుకునే ముందు కొన్ని వేడి పానీయాలు తీసుకుంటే ఆకలి తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీని కోసం ఆహారంలో సూప్ లేదా వేడి నిమ్మరసం తీసుకోవచ్చు. దీంతోపాటు ఆహారం తినే సమయంలో ఇతరుల ప్లేట్ నుంచి ఏమీ తినకూడదని గుర్తుంచుకోండి.

ఇలా చేయండి

బరువు తగ్గడానికి బయటి వస్తువులను తినడం మానుకోండి. దీంతోపాటు రోజుకు 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగాలి. ఈ చిట్కాలను అనుసరించడం వల్ల వ్యాయామం లేకుండా బరువు తగ్గవచ్చు.

Tags:    

Similar News