Food: బాదంను నానబెట్టకుండా తింటున్నారా.? సమస్యలు తప్పవంటోన్న నిపుణులు..!

అయితే మనలో చాలా మంది బాదంను నీటిలో నానబెట్టకుండానే తీసుకుంటుంటారు. కానీ దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-06-11 01:30 GMT

Food: బాదంను నానబెట్టకుండా తింటున్నారా.? సమస్యలు తప్పవంటోన్న నిపుణులు

Food: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటిలోని ఎన్నో ఔషధ గుణాలు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో మరీ ముఖ్యంగా బాదంతో ఎక్కువ లాభాలు ఉంటాయని తెలిసిందే. అందుకే వైద్యులు సైతం తప్పకుండా బాదంను డైట్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. మరీ ముఖ్యంగా బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్ని తీసుకుంటే ఆరోగ్యాన్ని మేలు జరుగుతుందని చెబుతుంటారు.

అయితే మనలో చాలా మంది బాదంను నీటిలో నానబెట్టకుండానే తీసుకుంటుంటారు. కానీ దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. పొట్టుతో బాదం తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు. ఇంతకీ బాదంను నానబెట్టకుండా నేరుగా తీసుకుంటే వచ్చే ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* బాదం పప్పులో ఫైబర్‌ కంటెంట్ పుష్కలంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అయితే బాదంను నానబెట్టకుండా తీసుకుంటే అది జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్‌, మలబద్ధకం వంటి సమస్యలు వెంటాడుతాయని అంటున్నారు.

* బాదంలో ఉండే ఫైటిక్ యాసిడ్ వంటి కొన్ని పోషకాలను శరీరం సులభంగా గ్రహించవు. అదే బాదం పప్పును నానబెట్టి తీసుకోవడం వల్ల ఫైటిక్‌ యాసిడ్ విచ్చిన్నమవుతుంది. ఈ కారణంగా శరీరం బాగా గ్రహించేలా చేస్తుంది.

* నానబెట్టకుండా బాదంను తీసుకోవడం వల్ల దంత సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన బాదం మెత్తగా ఉండడం వల్ల నమలడం కూడా సులభతరమవుతుంది.

* కొందరిలో బాదంపప్పు కారణంగా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బాదంపప్పును నానబెట్టడం వల్ల అలెర్జీకి కారణమయ్యే ప్రోటీన్‌లు తగ్గుతాయి, తద్వారా అలర్జీలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

NOTE: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News